http://www.youtube.com/watch?v=g8PGpzNCKK8
కస్తూరి రంగరంగా (శ్రీ క్రిష్ణజననం)
రాగం: ఆనంద భైరవి తాళం: త్రిశ్ర ఏక
ప. కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా
శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా
1. కంసుణ్ణి సం హరింప - సద్గురుఢు అవాతారమెత్తినపుఢు
దేవకి గర్భమునను - కృష్ణావతారమై జన్మించెనూ
2. ఏడు రాతృలు వింతగా - తాబూని ఏకరాత్రిగ చెసెను
ఆదివారము పూటనూ - అష్టమి దినమందు జన్మించెను
3. తలతోటి జననమైతే - తనకు బహుమోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్ళను బుట్టెనూ - ఏడుగురు దాదులను తాచంపెనూ
4. నెత్తుటిలో వుండినపుడు - ఆబాల కావుకావున ఏడ్చుచూ
నన్నేల ఎత్తుకొనవే - నాతల్లి దేవకీ వందనంబు
5. ఒళ్ళెళ్ళ హీనంబుతో - ఈరీతి నున్నవు కన్నతండ్రీ
నిన్నెట్టు లెత్తుకుందూ - నీవొక్క నిముసంబు తాళుమంచు
6. గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల గంగ తానుప్పొంగెనూ
గంగ నీటిలోనప్పుడూ - దేవకీ జలకంబు లాడెతానూ
7.ఇకనైన ఎత్తుకొనవే - నాతల్లి దేవకే వ0దన0బు
కానిబాలునివోలెను - నన్నిట్ట్లు ఎడబాసి వు0డతగునా
8. నీ పుణ్యమాయె కొడకా - ఇ0కొక్క నిమిష0బు తాళుమనుచూ
కామధేనువు నప్పుడూ - దేవకీ మదిలోన తలచగానూ
9. పాలవర్షము కురిసెను - అప్పుడా బాలపై జల్లగానె
తడి వస్త్రమును వీడియూ దేవకీ పొడి వస్త్రమును గట్టెనూ
10. పొత్తులమీదనపుడూ _ బాలు0డు చక్కగా పవళి0చెనూ
తన రె0డు హస్తములతో _ దేవకీ బాలుణ్ణి ఎత్తుకొనెనూ
11. అడ్డలపై వేసుక _ ఆబాలు చక్కదనమును జూచెనూ
వసుదేవ పుత్రుదమ్మ _ ఏబిడ్డ వైకు0ఠవాసుడమ్మ
12. సిరమున చి0తామణి _ నాత0డ్రినాలుకున నక్షత్రమూ
ప0డ్లను పరషువేది _ భుజమ0దు శ0ఖు చక్రములు గలవు
13. వీపున వి0జామర _నాత0డ్రి బొడ్డున పారిజాత0
అరికాళ్ళ తామరములు _ అన్నియు వున్నవిర నాడుత0డ్రి
14.నీ రూపు చక్కదనము _ ఆబ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసిత0డ్రి
అన్యకారి గర్భ0బున _ఏలజన్మిస్తివి నల్లనయ్య
15.మాయన్న క0సుడిపుదు _ మముగూద వచ్చెవేళాయెరన్నా
నెన్నెత్తుకొని ఇప్పుడు _ ఏత్రోవబోదురా కన్నత0డ్రీ
16. ఆచక్కదనము చూచి _ దేవకీ శోకి0ప సాగెనపుడూ
తల్లి శోకము మాంపగా _ మాదవుడు తానిట్ట్లు చేసెనపుడు
17. పెడబొబ్బలూ పెట్టుచూ _మాధవుడు గట్టిగా ఏడ్వసాగె
శోక0 చాలి0చితా _ బాలుణ్ణి ఎత్తుకొనెను
18. నాయన్న వూరుకోరా _ నాత0డ్రి గోపాల పవళి0చరా
అల్లదిగొ బూచివాడు _ నాత0డ్రి పవళి0చరా
19. బూచినను మర్థి0చునా _ నళినాక్షి బుద్ధిమ0థుడనన్ను
బూచేమి చేయునమ్మా _ నాతల్లి బూచి నన్నెరుగునమ్మా
20. నీపుణ్యమాయె కొడకా _ నీఒక్క నిమిష0బు తాళురన్న
అల్లదిగో జోగివాడు _ నాత0డ్రి వస్తాడు పవళి0చరా
21. జోగిమ0దుల స0చులూ _ ఏవేళ నాకడనె యు0డగానూ
జోగేమి చెయునమ్మ _ జోగినన్నెరుగునమ్మా
22. నాకు భయమాయె కొడకా _ నీవొక్క నిముస0బు తాళురన్న
అల్లదిగో పాము వచ్చె _ నాత0డ్రి గోపాల పవళి0చరా
23. పాములకు రాజు అయిన- శేషుని పాంపుపై నేను0డగా
పామేమి చెసునమ్మా - నళినాక్షి భయమునీకేలనమ్మా
24. మాయన్న ఆ క0సుడు - వచ్చు వేళాయెరా కన్నత0డ్రి
నాకేమి భయములేదే - ఓతల్లి నాకేమి కొదువ లేదే
25. మామ క0సుడు తెమ్మని - నిన్నడిగి నప్పుడెదురు కాళ్ళతో
అ0ది0చి చూడవమ్మా - దూరమున నిలుచు0డి చూడవమ్మా
26. మామనన్నే0చేయడు - ఏ వేళ నన్నువెరిపి0చవస్తే
మామామ నాచేతనే - మరణమై పోయేది నిజముసుమ్మ
27. వేళమి0చు నట0చును - నీతల్లి వసుదేవ బిలువన0పి
గోపమ్మ బిడ్డనటకు - శ్రీఘ్రముగ తెమ్మని కోరగాను
28. అంతటను వసుదేవుడు - బాలుణ్ణి తలమేద ఎత్తుకొనుచు
రేపల్లె వాడలోనూ - గోపెమ్మ యి0టి ను0డితానూ
29. గోపెమ్మ పుత్రికనపుడు - భుజముపై నుఒచుకొనియు
అతిత్వరితముగవచ్చి తా- దేవకీ హస్తమున ను0చెనపుడు
30.దేవకికి మగబిడ్డడు పుట్టెనని క0సుదున కబురాయెనూ
ఝల్లుమనిగు0డెలదిరి - పీఠమ్ము దుమికెనపుడు
31.జాతక0బును చూచెను - గ0డ0బు తగెలనని క0సుడపుడు
చక్ర్రాయుధ0బు బూని- శ్రీఘ్రముగ దేవకీ దరి చేరెను
32. మగవాడుకాడురన్న - ఈబిడ్డ ఆడపిల్లర నమ్ముమా
ఉపవాసములు నోములు -నోచియు పుత్రికను గ0టినన్న
33. దేవాది దేవులైన - బ్రహ్మే0ద్రాదులను పూజచేసి
కన్న పుత్రికను వదిలి - నాయన్న పుణ్యవ0తుడవు కమ్ము
34. కాదు కాదని క0సుశు - దేవకి పుత్రికను అడిగెనపుడు
అడ్డాలపై బిడ్డని పుచ్చుకొని ఎగరేసి నరకబోయే
35. అ0బరములో నిలచిన ఆ బాల ఓయబ్బ నిజముకనరా
రేపల్లె వాడలోనూ నీమగడు పెరుగు చున్నాడు వినరా
http://www.youtube.com/watch?v=g8PGpzNCKK8
kastoori rangarangaa (Sree krishNajananam)
aagam: aananda Bhairavi taaLam: triSra aeka
pa. kastoori rangarangaa - naayanna kaavaeTi rangarangaa
Sreerangarangarangaa - ninubaasi eTlunae marachunduraa
1. kamsuNNi sam harimpa - sadguruDhu avaataaramettinapuDhu
daevaki garBhamunanu - kRshNaavataaramai janminchenoo
2. eaDu raatRlu vintagaa - taabuuni eakaraatriga chesenu
aadivaaramu pooTanoo - ashTami dinamandu janminchenu
3. talatoaTi jananamaitae - tanaku bahumoasambu vachchunanuchu
eduru kaaLLanu buTTenoo - eaDuguru daadulanu taachampenoo
4. nettuTiloa vunDinapuDu - aabaala kaavukaavuna eaDchuchoo
nannaela ettukonavae - naatalli daevakee vandanambu
5. oLLeLLa heenambutoa - eereeti nunnavu kannatanDree
ninneTTu lettukundoo - neevokka nimusambu taaLumanchu
6. ganganoo praardhinchenoo - jalanidhula ganga taanuppongenoo
ganga neeTiloanappuDoo - daevakee jalakambu laaDetaanoo
7. ikanaina ettukonavea - naatalli deavakea va0dana0bu
kaanibaalunivoalenu - nanniTTlu eDabaasi vu0Datagunaa
8. Nee puNyamaaye koDakaa - i0kokka nimisha0bu taaLumanuchoo
kaamadheanuvu nappuDoo - deavakee madiloana talacagaanoo
9. paalavarshamu kurisenu - appuDaa baalapai jallagaane
taDi vastramunu veeDiyuu deavakii poDi vastramunu gaTTenuu
10. pottulameedanapuDuu _ baalu0Du chakkagaa pavaLi0chenuu
tana re0Du hastamulatoe _ deavakee baaluNNi ettukonenuu
11. aDDalapai veasuka _ aabaalu chakkadanamunu joochenuu
vasudeava putrudamma _ eabiDDa vaiku0ThavaasuDamma
12. siramuna chi0taamaNi _ naata0Drinaalukuna nakshatramuu
pa0Dlanu parashuveadi _ bhujama0du Sa0Ku chakramulu galavu
13. veepuna vi0jaamara _naata0Dri boDDuna paarijaata0
arikaaLLa taamaramulu _ anniyu vunnavira naaDuta0Dri
14.nee ruupu chakkadanamu _ aabrahma ennaaLLu vraasita0Dri
anyakaari garbha0buna _ealajanmistivi nallanayya
15.maayanna ka0suDipudu _ mamugooda vachcheveaLaayerannaa
nennettukoni ippuDu _ eatroavaboaduraa kannata0Dree
16. aachakkadanamu choochi _ deavakee Soaki0pa saagenapuDuu
talli Soakamu maanpagaa _ maadavuDu taaniTTlu cheasenapuDu
17. peDabobbaluu peTTuchuu _maadhavuDu gaTTigaa eaDvasaage
Soaka0 chaali0chitaa _ baaluNNi ettukonenu
18. naayanna vuurukoeraa _ naata0Dri goapaala pavaLi0charaa
alladigo boochivaaDu _ naata0Dri pavaLi0charaa
19. boochinanu marthi0chunaa _ naLinaakshi buddhima0thuDanannu
boocheami cheayunammaa _ naatalli boochi nannerugunammaa
20. neepuNyamaaye koDakaa _ neeokka nimisha0bu taaLuranna
alladigoa joagivaaDu _ naata0Dri vastaaDu pavaLi0charaa
21. joagima0dula sa0chulua _ eaveaLa naakaDane yu0Dagaanuu
joageami cheyunamma _ joaginannerugunammaa
22. naaku bhayamaaye koDakaa _ neevokka nimusa0bu taaLuranna
alladigoa paamu vacche _ naata0Dri goapaala pavaLi0charaa
23. paamulaku raaju ayina- Seashuni paanpupai neanu0Dagaa
paameami chesunammaa - naLinaakshi bhayamuneekealanammaa
24. maayanna aa ka0suDu - vachchu veaLaayeraa kannata0Dri
naakeami bhayamuleadea - oetalli naakeami koduva leadea
25. maama ka0suDu temmani - ninnaDigi nappuDeduru kaaLLatoa
a0di0chi chooDavammaa - dooramuna niluchu0Di chooDavammaa
26. maamanannea0cheayaDu - ea veaLa nannuveripi0chavastea
maamaama naacheatanea - maraNamai poayeadi nijamusumma
27. veaLami0chu naTa0chunu - neetalli vasudeava biluvana0pi
goapamma biDDanaTaku - Sreeghramuga temmani koaragaanu
28. antaTanu vasudeavuDu - baaluNNi talameada ettukonuchu
reapalle vaaDaloanuu - goapemma yi0Ti nu0Ditaanuu
29. goapemma putrikanapuDu - bhujamupai nuochukoniyu
atitvaritamugavachchi taa- deavakee hastamuna nu0chenapuDu
30.deavakiki magabiDDaDu puTTenani ka0suduna kaburaayenuu
Jallumanigu0Deladiri - peeThammu dumikenapuDu
31.jaataka0bunu choochenu - ga0Da0bu tagelanani ka0suDapuDu
chakrraayudha0bu booni- Sreeghramuga deavakee dari chearenu
32. magavaaDukaaDuranna - eebiDDa aaDapillara nammumaa
upavaasamulu noamulu -noachiyu putrikanu ga0Tinanna
33. deavaadi deavulaina - brahmea0draadulanu poojacheasi
kanna putrikanu vadili - naayanna puNyava0tuDavu kammu
34. kaadu kaadani ka0suSu - deavaki putrikanu aDigenapuDu
aDDaalapai biDDani puchchukoni egareasi narakaboayea
35. a0baramuloa nilachina aa baala Oyabba nijamukanaraa
reapalle vaaDaloanuu neemagaDu perugu chunnaaDu vinaraa