About Me

Over the last few decades I've spent a number of hours cooking for my family of 5. My husband is a retired bank Manager and my 3 boys are IIT graduates. Now I'm sharing my knowledge and thoughts to the world through this site. Whether you are a busy mom or a student learning to cook, you will find this blog helpful for cooking simple and easy to make food for yourself and the whole family. Hope you enjoy my recipe blog! I also love listening to devotional songs. Please browse through my devotional blogs to know more about them. I am always looking for ways to improve my blogs. Please leave your comments. If you like to see recipe of any particular dish or lyrics of a devotional song, please also let me know. Thanks for reading my blog.

Thursday 20 December 2012

ఏతీరుగ నను దయజూచెదవో

http://ww.raaga.com/play/?id=59690 

ఏతీరుగ నను దయజూచెదవో
ఇనువ0శోత్తమ రామా

నా తరమాభవసాగరమీదను నళినదళేక్షణ రామ|
కారుణ్యాలయ  భక్తవరద నిను కన్నది కానుపు రామా||శ్రీ రఘున0దన సీతారమణా  శ్రితజనపోషక  రామా|
కౄరకర్మములు నేరక చేసితి నేరములె0చకు రామా|
దారిద్ర్యము పరిహారము చేయవే దైవశిఖామణి  రామ||
వాస వనుత రామదాసపోషక వ0దనమయోధ్య  రామ|
దాసార్చిత మా, కభయ మొస0గవే దాశరధి రఘురామ||

English lyrics of   eateeruga nanu


eateeruga nanu dayajoochedavoe
inuva0Soattama raamaa

naa taramaabhavasaagarameedanu naLinadaLeaxaNa raama|

Sree raghuna0dana seetaaramaNaa  Sritajanapoashaka  raamaa|
kaaruNyaalaya  bhaktavarada ninu kannadi kaanupu raamaa||
kRurakarmamulu nearaka cheasiti nearamule0chaku raamaa|
daaridryamu parihaaramu cheayavea daivaSikhaamaNi  raama||
vaasa vanuta raamadaasapoashaka va0danamayoedhya  raama|
daasaarchita maa, kabhaya mosa0gavea daaSaradhi raghuraama||

పలుకే బ0గరమాయెనా కోద0డపాణి


http://ww.smashits.com/rama/paluke-bangaramayena/song-65166.html

పలుకే బ0గరమాయెనా కోద0డపాణి
పలుకే బ0గరమాయె పిలిచినపలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కనిత0డ్రి   ||పలుకే ||

1. రాతినాతిగజేసి భూతలమున
ప్రఖ్యాతి చె0దితివని నెరనమ్మితి నిన్నే త0డ్రి

2. ఎ0తవేడిన నీకు సు0తైనదయరాదు
ప0తముసేయ నేనె0తటి వాడనుత0డ్రి

3. శరణాగతత్రాణ  బిరుదా0కితుడవు  గాన
కరుణి0చు భద్రాచల వరరామదాసపోషక  ||పలుకే ||


http://ww.smashits.com/rama/paluke-bangaramayena/song-65166.html

 palukea ba0garamaayenaa koada0DapaaNi
palukea ba0garamaaye pilichinapalukaveami
kalaloa nee naamasmaraNa maruva chakkanita0Dri   ||palukea ||

1. raatinaatigajeasi పలుకే బ0గరమాయెనా కోద0డపాణి

prakhyaati che0ditivani neranammiti ninnea ta0Dri

2. e0taveaDina neeku su0tainadayaraadu
pa0tamuseaya neane0taTi vaaDanuta0Dri

3. SaraNaagatatraaNa  birudaa0kituDavu  gaana
karuNi0chu bhadraachala vararaamadaasapoashaka  ||palukea ||

Monday 10 December 2012

ఘల్లుగల్లున పాదగజ్జెల0ధెలు మ్రోగ


http://musicmazaa.com/MMaPlayer/play/

ఘల్లుగల్లున పాదగజ్జెల0ధెలు మ్రోగ
కలహ0స నడకల  కలికి ఎక్కడికే
జడలోని గ0గను ధరియి0చు కొన్నట్టి
జగములేలే  సా0బశివుని సన్నిధికే మ0గళం మ0గళం

1. తళతళమను రత్న తాట0కములు మెరయ
పసిడి కు0డలముల పడతి ఎక్కడికే
కరి చర్మా0బరదరుడు పురహరుడైనట్టి
గురుడైన బోళా శ0కరుని సన్నిధికే మ0గళం మ0గళం

2. చె0గావి చీరలు కొ0గులు జార0గ
ర0గైన నవమోహనా0గి ఎక్కడికే
పులితోలు వస్త్రములు వీభూధి ధరియి0చు
మ0డల మేలే జగదీసు సన్నిధికే మ0గళం మ0గళం    

http://musicmazaa.com/MMaPlayer/play/

ghallu ghalluna paadaga
ghallugallunaa paadha gajjela0dhelu mroaga 
kalaha0sa naDakala  kaliki ekkaDikea
jaDaloani ga0ganu dhariyi0chu konnaTTi 
jagamulealea  saa0baSivuni sannidhikea ma0gaLam ma0gaLam  
1. taLataLamanu ratna taaTa0kamulu meraya 
pasiDi ku0Dalamula paDati ekkaDikea
kari charmaa0baradaruDu puraharuDainaTTi 
guruDaina boaLaa Sa0karuni sannidhikea ma0gaLam ma0gaLam 

. che0gaavi cheeralu ko0gulu jaara0ga
ra0gaina navamoahanaa0gi ekkaDikea 
pulitoalu vastramulu veebhoodhi dhariyi0chu
ma0Dala  mealea jagadeesu sannidhikea ma0gaLam ma0gaLam       
  

Friday 7 December 2012

Song on Varalaxmi

  సాయ0కాల సమయ0 లో స0ద్యా దీపారాధనలో
వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి          || సా ||

1. కాళ్ళకు గజ్జెలు కట్టి0ది ఘల్లుఘల్లున వచ్చి0ది
పిలిచిన వె0టనే వచ్చి0ది అడిగినవన్నీ యిచ్చీ0దీ       || సా ||

2. అ0దరు చేరి రార0డి పూజలు బాగుగ చేయ0డి
ర0గులగాజులు తేర0డి   ముత్తైదువులకు  ప0చడి      || సా ||          

3. ధనములను ఇచ్చెను ధనలక్ష్మి  ధాన్యమునిచ్చును   ధాన్యలక్ష్మి
వరములనిచ్చును వరలక్ష్మి స0తానమిచ్చును స0తానలక్ష్మి           || సా ||          

4.  వజ్రకిరీట0 చూడ0డీ ముత్యాలహార0 చూడ0డీ  
నాగభరణ0 చూడ0డీ దేవీ రూప0 కనర0డీ                                      || సా ||          







saaya0kaala samaya0 loa sa0dyaa deepaaraadhanaloa
vachchenu talli varalakshmi vachchenu talli varalakshmi  || saa ||

1. kaalhlhaku gajjelu katti0di ghallughalluna vachchi0di
pilichina ve0Tanea vachchi0di adiginavannee yichchii0dee || saa ||

2. a0daru cheari raara0di poojalu baaguga cheaya0di
ra0gulagaajulu teara0Di   muttaiduvulaku  pa0chadi    

3. dhanamulanu ichchenu dhanalaxmi  dhaanyamunichchunu   dhaanyalaxmi
varamulanichchunu varalaxmi sa0taanamichchunu sa0taanalaxmi

4. vajrakireeta0 chooda0dee mutyaalahaara0 chooda0dee  
naagabharana0 chooda0dee deavee roopa0 kanara0dee     

Sree Rama haarathi



  రామచ0ద్రాయ జనక రాజజా మనోహరాయ
 మామకాభీష్టదాయ  -  మహిత మ0గళ0  |

1.  కౌసలేశా య మ0దహాస దాస పోషకాయ
    వాసవాది వినుత,  సర్వమ0గళ0 |  


2.   విమల రూపాయ వివిధవేదాoత     - వేద్యాయ
      సుము ఖ  చిత్తకామితాయ  శుభ మ0గళ0 |


3.    రామదాసాయ  మృదుల హృదయ  - కమల వాసాయ
       స్వామి భద్రగిరి వరాయ   - సర్వమ0గళ0

     సర్వమ0గళ0      సర్వమ0గళ0  ||


Song on Siva


1. ఓం హరాశ0కర హర హర
   వ0ద0న0 దిగ0బరా వ0దితా పుర0ధరా
   ఇ0దువర దుర0ధరా హిమాశ్చలాగ్ర వ0దిత     (ఓం)

2.అ0గజ మదహర రారా ఆశ్రిత  జనమ0దారా
  గ0గాధర మురహా గౌరీ వరహర చెరా
  లి0గ దృతు శుర0గ వృషతర0గ మ0గళాకరా    (ఓం)

3.అ0జలిదే గైకొరా ఆర్తిని బాపవదేరా
  మ0జులభాష సుధీరా మామక దోష నివారా
  కు0జ భవన త0జదైత్య భ0జనా హరా హరా    (ఓం)

4.కు0డలి భూష మహేశా కు0జర దనుజనివాసా 
   చ0డిక హృదయ నివాసా ఖ0డితకాలు నిపాశా 
   మ0డల0బులెల్ల ని0డి యు0డిన పరాత్పరా     (ఓం)







1. oem haraaSa0kara hara hara
   va0da0na0 diga0baraa va0dithaa pura0dharaa
   i0duvara dura0dharaa himaaSchalaagra va0dita           (oem)

2.a0gaja madahara raaraa aaSritha janama0daaraa
  ga0gaadhara murahaa gowree varahara cheraa
  li0ga dRtu Sura0ga vRshatara0ga ma0gaLaakaraa         (oem)

3.a0jalidea gaikoraa aartini baapavadearaa
  ma0julabhaaSha sudheeraa maamaka doasha nivaaraa 
  ku0ja bhavana ta0jadaitya bha0janaa haraa haraa           (oem)

4. ku0Dali bhoosha maheaSaa ku0jara danujanivaasaa 
    cha0Dika hRdaya nivaasaa kha0Ditakaalu nipaaSaa 
    ma0Dala0bulella ni0Di yu0Dina paraatparaa                 (oem)



Friday 10 August 2012

భరత మాత August 15th India Independence day Special


This was the song for which I performed a dance routine during my teenage years
 for August 15, Indian Independence Day. If you like it share it with your friends.


భరత మాత స్వేచ్చ్చ చరిత భరత మాత కల్పవల్లి
భరత ధాత్రి అ0దుకొనుమిదే పుష్పా0జలి
 ఓఓఓఓఓ మాతృశ్రీ     ||భరత మాత ||

1) కలవమ్మా నీ ఒడిలో కలవమ్మ శర్వ శక్తులు
   గ0గ, సింధు, గోదావరి ఐక్య నధీ గానము
   రవీంధ్రనాథ దివ్యసుధ, త్యాగరాజమధురగానము
   అజ0త  హంపి శిల్పకళలతొ రాణి0చెడి  
   ఓఓఓఓఓ మాతృశ్రీ                                              || భరత మాత ||

2) మనమ0తా ఒక కులము   మనమంధరిదేకజాతియే
   హిందు బౌధ్ధ ముసిలిమాను బిన్నత్వములేకయే
   ఏకత్వము  కలిగియే  విశ్వమ0త చాటి చెప్పెద0
   ఓ  శాంతి జనని
   ఓఓఓఓఓ మాతృశ్రీ                                             || భరత మాత ||

bharata maata sweacha charita bharata maata kalpavalli
bharata dhaatri a0dukonumidea pushpaa0jali  oeoeoeoeoe maatRSree     ||bharata maata ||

1) kalavammaa nee oDiloa kalavamma Sarva Saktulu
   ga0ga, sindhu, goadaavari aikya nadhee gaanamu
   raveendhranaatha divyasudha, tyaagaraajamadhuragaanamu
   aja0ta  hampi SilpakaLalato raaNi0cheDi  
   oeoeoeoeoe maatRSree                                ||bharata maata ||

2) manama0taa oka kulamu   manamandharideakajaatiyea
   hindu boudhdha musilimaanu binnatvamuleakayea
   eakatvamu  kaligiyea  viSwama0ta chaaTi  cheppeda0
   oe Saanti janani
   oeoeoeoeoe maatRSree                                  ||bharata maata ||

Tuesday 5 June 2012

మ0గళమ్ జయ మ0గళమ్


http://www.youtube.com/watch?v=aIjlG_fLq18
మ0గళ జ0య మ0గళ0


    మ0గళ0 జయ మ0గళ0 - మానల్లనయ్యకు మ0గళ0
   మ0గళ0మ్ శుభమ0గళ0 - మానల్లనయ్యకు మ0గళ0

1.  శ్యామలా0గుని కరమున0దలి  -సాధు మురళికి మ0గళ0
    శిరమున0దున సొగసుగల్కెడి  - శిఖిశిఖకు  జయ మ0గళ0

2. కరుణరసమును చి0దుచు0డెడి   - కన్నుదోయికి  మ0గళ0
    వనజ గరిమను ధిక్కరి0చెడి        -  వదన శోభకు మ0గళ0

3. భక్షజనులకు కల్పతరువగు   -     బాహుయుగళికి  మ0గళ0
    బహు విపులమై సిరిచెల0గెడి -    వక్షస్సీమకు మ0గళ0

4. ముజ్జగ0బులు లోనగలిగిన    -      బొజ్జసొగసుకు మ0గళ0
    శ0ఖచక్ర గదాది చిహ్నిత        -     చరణయుగళికి మ0గళ0

5. గోపవరమున దయను వెలసిన  -   గోపవరునకు మ0గళ0
   యతిని సీతారామునేలు           -   దయా0బురాశికి  మ0గళ0


  ma0naLam jaya ma0gaLam  English lyrics

     ma0naLam jaya ma0gaLam - maanallanayyaku ma0gaLam
     ma0gaLam shubhama0gaLam maanallanayyaku ma0gaLam

1.  shyaamalaa0guni karamuna0dhali  -  saaDhu muraLiki ma0gaLa0
     shiramuna0dhuna sogasugalkedi    -  shiKhishiKhaku  jaya ma0gaLam

2. karuNarasamunu chi0dhuchu0dedi  - kannudhoayiki  ma0gaLam
    vanaja garimanu Dhikkari0chedi      -    vadhana shoaBhaku ma0gaLam

3. BhakShajanulaku kalpatharuvagu   -  baahuyugaLiki man0La0
    bahu vipulamai sirichela0gedi          - vakShasseemaku ma0gaLam

  
4. mujjagaobulu loanagaligina              -        bojjasogasuku ma0gaLam

   sha0Khachakra gadhadhi chihnitha  -   charaNayugaLiki ma0gaLam
  
                                                                  
5. goapavaramuna dhayanu velasina  - goapavarunaku ma0gaLa0
    yathini seethaaraamunaelu  -   dhayaa0buraashiki  ma0gaLa0                          

Wednesday 2 May 2012

అన్నమాచార్య వాగ్దేయ వరదాయని ( annamaachaarya vaagdeaya varadaayani



    annamaachaarya vaagdeaya varadaayani

    The below songs will be listened by clicking the link below


    1. నా రాయణాయ నమో నమో
    2. అదివో అల్లదివో శ్రీ హరివాసము

    3. అప్పని వరప్రసాది అన్నమయ్య

    4.  మేలుకో శృ0గార రాయ మేటి మదన గోపాలా
    5. సతులాల చూడరే
    6. ఇట్టి ముద్దులాడి 
    7.  ముద్దుగారే యశోద
    8. ఆంజనేయ 


    1. నా రాయణాయ నమో నమో


    http://www.youtube.com/watch?v=GNEHdxa9KYI

    నా రాయణాయ నమో నమో
    నానాత్మనే నమో నమో
    ఈ రచనలనే ఎవ్వరు తలచిన
    ఇహ పరమ0త్రముల0దరికీ
      
    గోవి0దాయ నమో నమో  గోపాలాయ నమోనమో
     భావజ గురువే నమో నమో ప్రణవథ్మనెనమో
    దేవేశాయనమో నమో  దివ్య గుణాయ నమో నమో
    ఈవరుసలనే ఎవ్వరు థలచిన ఇహపరమ0త్రము లి0దరికి  ||

    దామోదరాయ నమోనమో ధరణీసాయనమోనమో 
    శ్రీ మహిళాపతయె నమో నమో శిష్టరక్షక నమో నమో
    వామనాయతే నమోనమో వనజాక్షయ  నమోనమో
    ఈమేరలనే ఎవ్వరు తలచిన ఇహపరమ0త్రము లి0దరికి ||

    పరిపూర్ణాయ నమోనమో ప్రణవాగ్రాయ నమోనమో
    చిర0థన శ్రీ వే0కనాయక శేషశాయినే నమోనమో
    నరకద్వ0సినే నమోనమో నరసి0హాయనమోనమో
    ఇరువుగ నీ గతి నెవ్వరు దలచిన ఇహపరమ0త్రము లి0దరికి ||


    naraayaNaaya namoa namoa


      naraayaNaaya namoa namoa
    naanaatmanea nama namoa
    ee rachanalanea evvaru thalachina
    iha parama0tramula0darikee  
    goavi0daaya namoa namoa  goapaalaaya namoanamoe

     bhavaja guruvea namoa namoa praNavathmanenamoa
    deaveaSaayanamoa namoa  divya guNaaya namoa namoa
    eevarusalanea evvaru thalachina ihaparama0thramu li0dariki

    daamoadaraaya namoanamoe dharaNeesaaya namoanam
    Sree mahiLapathaye namoe namoa SishTarakshaka namoa namoa
    vaamanaayate  namoanamoe vanajaaxaya  namoanamoe
    eemearalane evvaru thalachina ihapara ma0thramuli0dariki

    paripoorNaya namoanamoe praNavaagraaya namoanamoe
    chira0thana Sree vea0katanaayaka SeshaSaayinea namoanamoe
    narakadva0sinea namoanamoe narasi0haayanamoanamoe
    iruvuga nee gati nevvaru dalachina ihaparama0tramu li0dariki

    2. అదివో అల్లదివో శ్రీ హరివాసము

    అదివో అల్లదివో శ్రీ హరివాసము
    పదివేలు శెషుల  పడగలమయము  (అదివో)
     
    అదె వేంకటాచల మఖిలోన్నతము
    అదివో బ్రహ్మాదుల కపురూపము
    అదివో నిత్య నివాస మఖిల మునులకు
    అధే చూడు డదే మొక్కుడానందమయము  (అదివో)

    చెంగట నల్లదివో శేషాచలము
    మునింగినున్న దేవతల నిజవాసము
    ముంగిట నల్లదివో మూలనున్న ధనము
    బంగారు  శిఖరాల బహు బ్రహ్మ్మమయము  (అదివో) 

    కైవల్యపదము వేంకటనగ మదివో
    శ్రీ వేంకటపతికి సిరులైనది
     భావింప సకల సంపదరూప మదివో
    పావనముల కెల్ల బావనమయము   (అదివో) 

    adivO alladivO

    adivO alladivO shree harivaasamu
    padivElu Seshula  paDagalamayamu (adivO)

    ade vEnkaTaacala makhilOnnatamu 
    adivO brahmaadula kapuroopamu 
    adivO nitya nivaasa makhila munulaku
    adhE cooDu DadE mokkuDaanandamayamu (adivO)

    cengaTa nalladivO Seashaacalamu
    ninginunna dEvatala nijavaasa
    mumungiTa nalladivO moolanunna dhanamu
    bangaaru  Sikharaala bahu brahmmamayamu (adivO)

    kaivalyapadamu vEnkaTanaga madivO
    Sree vEnkaTapatiki sirulainadi
    bhaavimpa sakala sampadaroopa madivO
    paavanamula kella baavanamayamu (adivO0 

    3. అప్పని వరప్రసాది అన్నమయ్య

    http://www.4shared.com/mp3/o043okZo/Misc_-_Track_01


    అప్పని వరప్రసాది అన్నమయ్య
    అప్పసము మాకే కలడన్నమయ్య         



    అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
    అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
    సంతసాన చెలువొందే సనకసనందనాదు-
    లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య        ||

    బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
    హరిమీద విన్నవించె అన్నమయ్య
    విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
    అరసి తెలిపినాడు అన్నమయ్య                ||

    అందమైన రామానుజ ఆచార్యమతమును
    అందుకొని నిలచినాడు అన్నమయ్య
    విందువలె మాకును శ్రీవేంకటనాఠునినిచ్చె
    అందరిలో తాళ్ళపాక అన్నమయ్య            ||


    appani varaprasAdi 
    http://www.4shared.com/mp3/o043okZo/Misc_-_Track_01.
    appani varaprasAdi annamayya
    appasamu mAkE kalaDannamayya   

    aMtaTiki Elikaina AdinArAyaNu tana
    aMtaraMgAna nilipina(penu) annamayya
    saMtasAna cheluvoMdE sanakasanaMdanAdu-
    laMtaTivADu tALLApAka annamayya       ||

    birudu TekkemulugA pekkusaMkIrtanamulu
    harimIda vinnaviMche annamayya
    virivigaliginaTTi vEdamula arThamella
    arasi telipinADu annamayya                   ||

    aMdamaina rAmAnuja AchAryamatamunu
    aMdukoni nilachinADu annamayya
    viMduvale mAkunu SrIvEMkaTanAThuninichche
    aMdarilO tALLapAka annamayya        ||

    4.  మేలుకో శృ0గార రాయ మేటి మదన గోపాలా

     మేలుకో శృ0గార రాయ మేటి మదన గోపాలా
    మేలుకోవే నాపాల మి0చిన నిధానమా

    1.స0దడి0చే గోపికల జవ్వన వనములోన
    క0దువదిరిగే మద గజమవు
    యి0దుముఖి సత్యభామ హృదయ  పద్మములోని
    గ0ధముమరిగినట్టి గ0డు టుమ్మెదా

    2. గతిగూడి రుక్మిణి కౌగిట ప0జరములో
    రతి ముద్దు గుడిసేటి  రాచిలుకా
    సతులు పదారువేల జ0ట కన్నుకలువలకు
    ఇతవై   పొడమిన  నా యి0దుబి0బమా

    3.వరుస కొలవిలోని వారి చన్ను కన్నులపై
    నిరతి  వాలిన నా నీల మేఘమా
    సిరినురమున మోచి శ్రీవే0కటాద్రి మీద
    గరిమ వరాలిచ్చే కల్ప తరువా

    mealukoa SR0gaara raaya 

    mealukoavea naapaala mi0china nidhaanamaa

    1.samealukoa SR0gaara raaya0daDi0chea goapikala javvana vanamuloana
    ka0duvadirigea mada gajamavu
    yi0dumukhi satyabhaama hRdaya  padmamuloani
    ga0dhamumariginaTTi ga0Du Tummedaa

    2. gatigooDi rukmiNi kougiTa pa0jaramuloa
    rati muddu guDiseaTi  raachilukaa
    satulu padaaruveala ja0Ta kannukaluvalaku
    itavai   poDamina  naa yi0dubi0bamaa

    3.varusa kolaviloani vaari channu kannulapai
    nirati  vaalina naa neela meaghamaa
    sirinuramuna moachi Sreevea0kaTaadri meeda
    garima varaalichchea kalpa taruvaa



    5. సతులాల చూడరే

      http://www.4shared.com/mp3/4M2q4Dzj/02Sthulala_Choodare

    సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
    గతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు

    పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
    యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
    అట్టె కిరీటము నాభరణాలు ధరించి
    యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు

    వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
    యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు
    ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
    హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు

    కొద దీర మరి నందగోపునకు యశోదకు
    ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
    అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
    యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు
    satulAla chUDarE 

    satulAla chUDarE SrAvaNabahuLAshTami(
    gatalAya naDurEyi( galige SrIkRshuDu

    puTTEyapuDE chaturbhujAlu SaMkhuchakrAlu
    yeTTu dhariyiMchenE yI kRshNuDu
    aTTe kirITamu nAbharaNAlu dhariMchi
    yeTTA neduTa nunnADu yI kRshNuDu

    vachchi brahmayu rudruDu vAkiTa nutiMchagAnu
    yichchagiMchi vinuchunnA(DIkRshNuDu
    muchchaTADI dEvakitO muMchi vasudEvunitO
    hechchinamahimalatO yI kRshNuDu

    koda dIra mari naMdagOpunaku yaSOdaku
    idigO tA biDDADAye nIkRshNuDu
    adana SrI vEMkaTESuDai yalamElmaMga(gUDi
    yeduTanE niluchunnA DIkRshNuDu

    6. ఇట్టి ముద్దులాడి 

     ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని 
     పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే

     కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన 
     చేమ పూవు కడియాల చేయిపెట్టి
     చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార 
     వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే     ||

     ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి 
     తచ్చెడి పెరుగులోన తగవెట్టి
     నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార 
     వొచ్చెలి వాపోవువాని నూరడించరే   ||

     ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని 
     చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
     అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన 
     తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే   ||


    iTTi muddulADi baaluDaeDavaaDu vaani 
     paTTi techchi poTTaniMDa paalu vOyarae

    aamiDai paarideMchi kaageDi vennalalOna 
    chaema poovu kaDiyaala chaeyipeTTi
    cheema guTTenani tana chekkiTa kanneeru jaara 
     vaemaru vaapOye vaani veDDuveTTarae

    muchchuvale vachchi tana muMgamuruvulachaeyi 
    tachcheDi perugulOna tagaveTTi
    nochchenani chaeyideesi nOranella jollugaara .
    vochcheli vaapOvuvaani nooraDiMcharae

    eppuDu vachchenO maa yillu jochchi peTTaelOni 
    chepparaani vuMgaraala chaeyipeTTi
    appaDaina vaeMkaTaedriasavaalakuDu gaana 
     tappakuMDa beTTevaani talaketta rae 


    7.  ముద్దుగారే యశోద



    ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడుతిద్దరాని మహిమల దేవకీ సుతుడు

    అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యముపoతమాడే కంసుని పాలి వజ్రముకాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూసచెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు      ||

    .రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడముమితి గోవర్థనపు గోమేధికముసతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యముగతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు        ||

    .కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగముఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలముపాలజలనిధిలోన పాయని దివ్య రత్నముబాలుని వలె తిరిగే పద్మనాభుడు              ||

    muddugaarae yaSOda 


    muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
    tiddaraani mahimala daevakee sutuDu

    aMtaniMta golletala arachaeti maaNikyamu
    paMtamaaDae kaMsuni paali vajramu
    kaaMtula mooDu lOkaala garuDa pachcha poosa
    cheMtala maalOnunna chinni kRshnuDu  ||

    ratikaeLi rukmiNiki raMgumOvi pagaDamu
    miti gOvarthanapu gOmaedhikamu
    satamai SaMkhuchakraala saMdula vaiDhooryamu
    gatiyai mammu gaachae(Ti)kamalaakshuDu     ||

    kaaLiMguni talalapai kappina pushyaraagamu
    aelaeTi SreevaeMkaTaadri yiMdraneelamu
    paalajalanidhilOna paayani divya ratnamu
    baaluni vale tirigae padmanaabhuDu                ||

    8. ఆంజనేయ అనిలజ
    ఆంజనేయ అనిలజ హనుమం
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత 
    శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత
     నీరంజకపు చేతలు సురలకెంత వశమా

    తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి 
     ఆర్జునుదుకౌరవుల గెలిచే 
    సంగర భూమినిసారెకు భీముడు  
    పురుషాముగ్రము తెచ్చు చోట 
    నీరోమములు కావ నిఖిల కారణము    ||

    నీ మూలమునగాదె నేలవై సుగ్రీవు
    డు
    రాముని గొలిచి కపిరాజాయనురాము
    దు నీ వంకనేపొ రమణి  సీతా దే
    విప్రేమముతొ మగుడా  పెండ్లాడెను         ||

    బలుదైత్యులను దుంచ బంటు
      తనము మించకలకాలమునునెంచ
     కలిగితిగాఅల శ్రీవేంకటపతి  అండనె 
     మంగాంబుధి నిలయపు హనుమంత నెగదితిగా        ||

    aanjaneaya anilaja hanumanthaSree aamjanaeya anilaja hanumamtaSree aamjanaeya anilaja hanumamta neeramjakapu chaetalu suralakemta vaSamaa
    Charanam1:
    taerimeeda nee roopu techchipeTTi  aarjunudukauravula gelichae samgara bhoominisaareku bheemuDu  purushaamugramu techchu choaTa neeromamulu kaava nikhila kaaraNamu 

    nee moolamunagaade nealavai sugreevuduraamuni golichi kapiraajaayanuraamudu nee vamkanaepo ramaNi  seetaa daevipraemamuto maguDaa  pemdlaadenu

    baludaityulanu dumcha bamTu  tanamu mimchakalakaalamununemcha kaligitigaaala SreevaemkaTapati  amDane  mamgaambudhinilayapu hanumamta negaditigaa     









      

    Saturday 14 April 2012

    అ0బ నీకిదే హారతి శ్రీరాజరాజేశ్వరి (amba neekide harathi

              అ0బ నీకిదే  హారతి   శ్రీరాజరాజేశ్వరి   (2)

    1.  పరమ భక్తులు నిన్ను భజియు0చు చున్నారు   (2)
         పరిపాలి0చి బ్రోవవే  శ్రీ జగదేశ్వరి
         పరిపాలి0చి బ్రోవవే శ్రీ జగదేశ్వరి
         అ0బ నీకిదే  హారతి

    2. నీ పాదములు నమ్మి నిను కొలుచుచున్నాము   (2)
       కాపాడి కరుణి0చవే  కనికరములతో
       కాపాడి కరుణి0చవే  కనికరములతో               
       అ0బ నీకిదే  హారతి

    English Lyrics

      a0ba neekidhae  haarathi   shreeraajaraajaeshvari   (2)

    1.parama bhakthulu ninnu   bhajiyu0chu chunnaaru
      paripaali0chi broavavae   shree jagadhaeshvari
      paripaali0chi broavavae   shree jagadhaeshvari   
      a0ba neekidhae  haarathi

    2. nee paadhamulu nammi ninu koluchuchunnaamu   2
       kaapaadi karuNi0chavae  kanikaramulathoa    
       kaapaadi karuNi0chavae  kanikaramulathoa     
       a0ba neekidhae  haarathi
                

    ( పూజా సేతుము రారమ్మా )pooja sethumu raramma

    http://www.raaga.com/play/?id=48021

       పూజా సేతుము రారమ్మా
      ఈవేళ మహలక్ష్మికి పూజా సేతుము రారమ్మా

      పూజ సేతము రారె రాజీవ నేత్రులారా
      జాజి పువ్వుల పూజ రోజూ  మాలక్ష్మి దేవికి                   ( పూజా సేతుము రారమ్మా )  

    2. హెచ్చెన నిత్య మల్లెలు    ఎర్రని పొగడపూలు
       పచ్చని కనకా0బ్రా లు       మెచ్చిన మహలక్ష్మిదేవికి         ( పూజా సేతుము రారమ్మా )  

    3. బ0తి చామ0తి పూవుల, బ0గారు పూవులు బ0తి
        దొ0తు గన్నేరు పూలు    తోను   మహలక్ష్మిదేవికి            ( పూజా సేతుము రారమ్మా ).  
      
    4..న0దివర్దానలు                      నాగమల్లెలు మ0చి
        మ0దార కుసుమ పువ్వుల    ము0దు  మహలక్ష్మిదేవికి( పూజా సేతుము రారమ్మా )

    5..దేవ కా0చనాలు         తావి గులాబిలు
      తావి కల్గిన పూజరోజూ   మహలక్ష్మిదేవికి                         ( పూజా సేతుము రారమ్మా )            


       poojaa saethumu raarammaa 
      eevaeLa mahalakShmiki
      poojaa saethjumu raarammaa 

      pooja saethamu raare raajeeva naethrulaaraa 
      jaaji puvvula pooja roajoo  maalakShmi dhaeviki
     ( poojaa saethumu raarammaa ) 

    2. hechchena nithya mallelu       errani pogadapoolu
       pachchani kanakka0bralu        meechchina mahalakShmidhevikinn
      ( poojaa saethumu raarammaa )
     
     3.ba0thi chaama0thi poovula,    ba0gaaru poovulu ba0thi
       dho0thu gannaeru poolu          thoanu   mahalakShmidhaeviki
       ( poojaa saethumu raarammaa )

     4. na0dhivardhaanalu                  naagamallelu ma0chi
         ma0dhaara kusuma puvvula    mu0dhu mahalakShmidhaeviki
       ( poojaa saethumu raarammaa )

    5.dhaeva kaa0chanaalu                  thaavi gulaabilu
       thaavi kalgina pooja roajoo         mahalakShmidhaeviki
    ( poojaa saethumu raarammaa )             

    Friday 13 April 2012

    శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా (Lalitha Mangala Harath(



    శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
    శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
    శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

    1.    జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
          అనయము మము కనికరమున కాపాడే జననీ,
         మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
         మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి.
         శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
         శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మం

    2   అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,
        అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
       రవ్వల తళుకుల కళళా జ్యోతుల --- కర్పూరహారతి,
       సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి.
       శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
       శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
       శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

    ( మ0గళమ్ జయ మ0గళమ్ ) mangaLam jaya mangaLam

      http://www.youtube.com/watch?v=aIjlG_fLq18   (same tune)

     మ0గళ0జయ మ0గళ౦    పట్టభిరామా  మ0గళ0
      మ0గళ0 శుభమ0గళ0     కోద0డరామా మ0గళ0
      చరణ దాసుల ప్రేమ పాలన   - సేయు  ప్రభువ మ0గళ0

    1.  శ్రితులకును తన్మయతకూర్చే    చిరునగవునకు మ0గళ0
        కా0తి పు0జము లీనుచు0డెది  శ్రీముఖమునకు మ0గళ0

    2.  కరుణ మదువులు కురియు చు0డెడి    కన్నుదోయికి మ0గళ0
        సిరి చల0గెడి పెడద వక్షస్సీమకును శుభ మ0గళ0

    3. ఆర్తులకు అభయ0బొస0గెడి   హస్తయుగళికి మ0గళ0
      శ0ఖ చక్ర గదాది చిహ్నిత   చరణ యుగళికి మ0గళ0


    http://www.youtube.com/watch?v=aIjlG_fLq18 English Lyrics
              
        ma0gaLa0jaya ma0gaLa0-pattabhiraamaa  ma0gaLa0
        ma0gaLa0 shubhama0gaLa0 koadha0daraamaa ma0gaLa0
       charaNa ehaasula preamapaalana   - saeuy prabhuva ma0gaLa0

    1.  shrithulakunu thanmayathakoorchae    chirunagavunaku ma0gaLa0
         kaa0thi pu0jamu leenuchu0dedhi  shreemukhamunaku ma0gaLa0

    2.  karuNa madhuvulu kuriyu chu0dedi    kannudhoayiki ma0gaLa0
        siri chala0gedi pedadha vakShasseemakunu shubha ma0gaLa0

    3. aarthulaku abhaya0bosa0gedi   hasthayugaLiki ma0gaLa0
       sha0kha chakra gadhadhi chihnitha   charaNa yugaLiki ma0gaLa0               

    Thursday 12 April 2012

    జయ జయ స్వామిన్ జయ జయ (Jaya Jaya Swamin)

    http://www.4shared.com/music/z5GKf2yo/file.html 
    http://www.4shared.com/music/z5GKf2yo/file.html

     
         జయ జయ స్వామిన్ జయ జయ   (  2  )

    అ.ప.  జయ జితవైరి వర్గ ప్రచ0డ
             జయ జయ గజ ముఖ జయ వక్రతు0డ

    1. 
    మూషక వాహన మునిజన వ0ద్య
        దోషరహిత దలితా సుర బృ0ద
        శేష భూషణ  శైవ వారది చ0ద్ర
        పోషిత పరిజన పుణ్యైక క0ద      (జయ జయ స్వామిన్ జయ జయ)   

    2.  ల0భోదర ధీర లావణ్యసార
        క0బు సుధానిధి కర్పూర గౌర
       సా0బ సదాశివ సతృతి చతుర
       సామవేద గీత సకలాధార          (జయ జయ స్వామిన్ జయ జయ)   

    3. శక్రాది సురగణసన్నుత చరణ
       శాతకు0భమణి దివ్యాభరణ
       ధికృత ఘనవిఘ్న తిమిరావరణ
       దీర నారాయణ తీర్ధ సుకరుణ      (జయ జయ స్వామిన్ జయ జయ)   


    English Lyrics

              jaya jaya svaamin jaya jaya    2

    a.pa.  jaya jithavairi varga pracha0da
             jaya jaya gaja muKha jaya vakrathu0da

    1.  mooShaka vaahana munijana va0dhya
        dhoaSharahitha dhalithaa sura btR0dha
        shaesha BhooShana shaiva vaaradhi cha0dhra
        poaShith parijana puNyaika ka0dha

    2.  la0bhoadhara Dheera laavaNyasaara
         ka0bu suDhaaniDhi karpoora gaura
         saa0ba sadhaasiva sathtRthi chathura
         saamavaedha geetha sakalaaDhaara

    3.  shakraadhi suragaNasannutha charaNa
         shaathaku0BhamaNi dhivyaabharaNa
         DhiktRtha ghanavighna thimiraavaraNa
         dheera naaraayaNa theerDha sukaruNa              

    రామచ0ద్రాయ జనక రాజజా మనోహరాయ (Ramachandraya janaka




      రామచ0ద్రాయ జనక రాజజా మనోహరాయ
     మామకాభీష్టదాయ  -  మహిత మ0గళ0

    1. కౌసలేయాయ మ0దహాస దాస పోషణాయ
       వాసవాది వినుత స -ద్వరద మ 0గళ0
       చారుకు0కుమోపేత  - చ0దనాను చర్చితాయ
       హారకటక శోభితాయ   భూరి మ0గళ0

    2. లలిత రత్నకు0డలాయ  - తులసీ వనమాలికాయ
       జలజసదృశ దేహాయ   - చారు మ0గళ0
       దేవకీ పుత్రాయ  - దేవదేవోత్తమాయ
       చావజతగురువరాయ  - భవ్యమ0గళ0

    3. పు0డరీకాక్షాయ పూర్ణచ0ద్రాననాయ
        అ0డజాత వాహనాయ   - అతుల మ0గళ0
        విమల రూపాయ వివిధవేదాoత     - వేద్యాయ
       సుజన   చిత్తకామితాయ  శుభగ  మ0గళ0
                              
    4. రామదాస  మృదుల హృదయ  - తామరస నివాసాయ
        స్వామి భద్రగిరి వరాయ   - సర్వమ0గళ0

        రామచ0ద్రాయ జనక రాజజా మనోహరాయ
        మామకాభీష్టదాయ  -  మహిత మ0గళ0

    English Lyrics 


         raamacha0dhraaya janaka raajajaa manoaharaaya
         maamakaabheeShtadhaaya  -  mahitha ma0gaLa0

    1. Kausalaeyaaya ma0dhahaasadhaasa poaShaNaaya
        vaasavaadhi vinuthasa   - dhvaradha ma0gaLa0
        chaaruku0kumoapaetha  - cha0dhanaanu charchithaaya
        haarakataka shoabhithaaya   bhoori ma0gaLa0

    2. lalitha rathnaku0dalaaya  - thulasee vanamaalikaaya
        jalajasadhtRsha dhaehaaya   - chaaru ma0gaLa0
       dhaevakee puthraaya  - dhaevadhaevoaththamaaya
       chaavajathaguruvaraaya  - bhavyama0gaLa0

    3.pu0dareekaakShaaya poorNacha0dhrananaaya
       a0dajaatha vaahanaaya   - athula

ma0gaLa0
       vimala roopaaya viviDha    - vaedhyaaya
       sujana chiththakaamithaaya  shuBhaga ma0gaLa0                            
    4. raamadhaasa mtRdhula htRdhaya  - thaamarasa nivaasaaya
       svaami bhadhragirivaraaya   - sarvama0gaLa0
       raamacha0dhraaya janaka raajajaa manoaharaaya
       maamakaabheeShtadhaaya  -  mahitha ma0gaLa0              

    Sunday 11 March 2012

    పాహిరామచ0ద్ర పాలిత సురే0ద్ర ( paahiraamacha0dhra )

      http://www.4shared.com/music/va2L-UGC/file.html 

     పాహిరామచ0ద్ర పాలిత సురే0ద్ర
      పరమపావన సద్గుణ గణసా0ద్ర

    1.నీరద నీల మునీ0ద్ర హృదయ
      నారద సేవిత సారన నయన  (పాహిరామచ0ద్ర)               
     

    2.శ్రీకర రూప సుధాకర వదన
      శోకనివారణ సు0దర వదన     (పాహిరామచ0ద్ర)   
          

    3. నిర్మలరూప ని0దిత మదన
       శర్మద సకలేశార్ణవ సదన    (పాహిరామచ0ద్ర)
          
    4. రాజరాజనుత రాఘవ త్యాగ
       రాజహృదయ రక్షిత నాగ    (పాహిరామచ0ద్ర)    


    http://www.4shared.com/music/va2L-UGC/file.html 

    English Lyrics

     paahiraamacha0dhra paalitha surae0dhra
      paramapaavana sadhguNa gaNasaa0dhra

    1.neeradha neela munee0dhra htRdhaya
      naaradha saevitha saarana nayana                   
          (paahiraamacha0dhra)

    2.shreekara roopa suDhaakara vadhana
      shoakanivaaraNa su0dhara vadhana
           (paahiraamacha0dhra)

    3. nirmalaroopa ni0dhitha madhana
       sharmadha sakalaeshaarNava sadhana
           (paahiraamacha0dhra)
    4. raajaraajanutha raaghava thyaga
       raajahtRudhaya rakShitha naaga
    జయదేవ  అష్టపది (కానడ రాగo-ఆది తాలo)

    1.  నిoదతి చoదన మిoదు కిరణ మనువిoదతి
        ఖేదo అధీరo కృష్ణ
        వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి 
        మలయసమీరమ్ కృష్ణ
        సా విరహే తవ దీనా కృష్ణ
        మాధవ ! మనసిజ విశిఖ
        భయాదివ భావనయా త్వయి లీనా కృష్ణ
        ..  సావిరహే తవ దీనా .....

    2. అవిరళ నిపతిత మదన శరాదివ,
       భవదవనాయ విశాలo కృష్ణ
       స్వహృదయమర్మణి వర్మ కరోతి
       సజలనళినీదళజాలమ్, కృష్ణ
       ..   సావిరహే తవ దీనా ......

    3. కుసుమ విశిఖ శరతల్ప మనల్ప విలాస
       కల్కమనీయo కృష్ణ
       వ్రతమియ తవ పరిరoభ సుఖాయ కరోతి
       కుసుమశయనీయమ్ కృష్ణ
      ..   సావిరహే తవ దీనా ......

    4. వహతి చ వలిత విలోచన జలధరo
       ఆన నకమలo ఉదారo కృష్ణ
       విధుమివ వికట విధుoతుద దoత దళన
       గళితామృతధారమ్ కృష్ణ
       ..   సావిరహే తవ దీనా ......

    5. విలిఖతి రహసి కురoగమదేన భవoతo
       ఆసమ శరభూతo కృష్ణ
       ప్రణమతి మకర మధో వినిధాయ కరేచ
       శరo నవచూతమ్ కృష్ణ
       ..   సావిరహే తవ దీనా ......

    6. ధ్యానలయేన పుర: పరికల్ప్య భవoతo
       అతీవ దురాపo కృష్ణ
       విలపతి హసతి విషీదతి రోదితి చoచతి
       ముoచతి తాపమ్ కృష్ణ
       ..   సావిరహే తవ దీనా ......

    7. ప్రతిపదమిదమపి నిగదతి మ్నాధవ!
       తవ చరణే పతితాo హo కృష్ణ
       త్వయి విముఖే మయి సపతి సుధానిధిరపి
       తనుతే తనుదాహమ్ కృష్ణ 
       ..   సావిరహే తవ దీనా ......

    8. శ్రీ జయదేవ భణిత మిద మధీకo
       యది మనసా నటనీయo కృష్ణ
       హరి విరహాకుల వల్లవయువతి సఖీ
       వచనo పఠనీయమ్ కృష్ణ
       ..   సావిరహే తవ దీనా ......

    jayadhaeva  aShtapadhi (kaanada raaga0-aadhi thaala0)

    1.  ni0dhathi cha0dhana mi0dhu kiraNa manuvi0dhathi
        Khaedha0 aDheera0 ktRShNa
        vyaaLanilaya miLanaena garaLamiva kalayathi 
        malayasameeram ktRShNa
        saa virahae thava dheenaa ktRShNa
        maaDhava ! manasija vishiKha
        Bhayaadhiva Bhaavanayaa thvayi leenaa ktRShNa
        ..  saavirahae thava dheenaa .....
    2. aviraLa nipathitha madhana sharaadhiva,
       Bhavadhavanaaya vishaala0 ktRShNa
       svahtRdhayamarmaNi varma karoathi
       sajalanaLineedhaLajaalam, ktRShNa
       ..  saavirahae thava dheenaa ......
    3. kusuma vishiKha sharathalpa manalpa vilaasa
       kalkamaneeya0 ktRShNa
       vrathamiya thava parira0Bha suKhaaya karoathi
       kusumashayaneeyam ktRShNa
       ..  saavirahae thava dheenaa ......
    4. vahathi cha valitha viloachana jalaDhara0
       aana nakamala0 udhaara0 ktRShNa
       viDhumiva vikata viDhu0thudha dha0tha dhaLana
       gaLithaamtRthaDhaaram ktRShNa
       ..  saavirahae thava dheenaa ......
    5. viliKhathi rahasi kura0gamadhaena Bhava0tha0
       aasama sharaBhootha0 ktRShNa
       praNamathi makara maDhoa viniDhaaya karaecha
       shara0 navachootham ktRShNa
      ..  saavirahae thava dheenaa ......
    6. Dhyaanalayaena pura: parikalpya Bhava0tha0
       atheeva dhuraapa0 ktRShNa
       vilapathi hasathi viSheedhathi roadhithi cha0chathi
       mu0chathi thaapam ktRShNa
       ..  saavirahae thava dheenaa ......
    7. prathipadhamidhamapi nigadhathi mnaaDhava!
       thava charaNae pathithaa0 ha0 ktRShNa
       thvayi vimuKhae mayi sapathi suDhaaniDhirapi
       thanuthae thanudhaaham ktRShNa 
       ..  saavirahae thava dheenaa ......
    8. shree jayadhaeva BhaNitha midha maDheeka0
       yadhi manasaa nataneeya0 ktRShNa
       hari virahaakula vallavayuvathi saKhee
       vachana0 paTaneeyam ktRShNa
       ..  saavirahae thava dheenaa ......

    నౌమి దేవ దేవ దేవ

    నాటరాగ0      ఆదితాళ0

    నౌమి దేవ  దేవ గౌరి న0దన గణనాయకా
     కామితార్ధ దాయకాఖిల కలిత సుఖవిదాయక

    1.  ఫాలచoద్ర సర్వవిఘ్న భoజన గణరoజన
        ఖేలదాఖ వాహనరికేళ ఫలసుభోజన

    2.  కరిముఖైకదoత చలిత కర్ణయుగళ సుoదర
        పరమపురుష శివతనూజ భక్త హృదయ మoదిర

    3.  కేకి వాహనాగ్ర జాజ కేశవాది సన్నుత
        పాక శాసనాది సకల నాకలోక పూజిత

    4.  అ0తరాయ తిమిర ప0కజాప్త  సన్నిభప్రభో 
        ద0త కా0తి విజిత వజ్ర ద0డ వే0కటవిభో  

    ENGLISH LYRICS

    naataraaga0       aadhithaaLam 
         
    naumi dhaeva dhaeva dhaeva gauri na0dhana gaNanaayakaa
    kaamithaarDha dhaayakaaKhila kalitha sukhavidhaayaka

    1.  phaalacha0dhra sarvavighna bha0jana gaNara0jana
        khaeladhaakha vaahanarikaeLa phalasubhoajana

    2.   karimukhaikadha0tha chalitha karNayugaLa su0dhara
         paramapuruSha shivathanooja bhaktha htRdhaya ma0dhira

    3.   kaeki vaahanaagra jaaja kaeshavaadhi sannutha
          paaka shaasanaadhi sakala naakaloaka poojitha

    4.   a0tharaaya thimira pa0kajaapta sannibhaprabhoa
          dha0tha kaa0thi vijitha vajra dha0da vae0katavibhoa 


    శోభనమే ....శోభనమే  నిత్యశోభనమే 

    1. గిరికార్ముక మొనరి0చి
       ఉరమము నారిగ బిగియి0చి
       పరగ శ్రీ హరియను, బాణము
       తొడిగియు పురములు గెలిచిన పుణ్యునకు
                     (శోభనమే ....శోభనమే)
       
    2. గిరి గర్బ0బున ఉదయి0చి
       హరుని పె0డ్లాడి మోదము పె0చి
       సురులను బ్రోచి అసురుల గెలిచిన
       పరమపతివ్రత పార్వతికి
                     (శోభనమే ....శోభనమే)

    3. తరిగొ0డ హరి పాదమున పుట్టి
       తనర మహేశుని చేపట్టి
       గరిమనులోక లోకములు రక్షి0చిన
       సరసిజ లోచన జాహ్నావికి
                     (శోభనమే ....శోభనమే)

    ENGLISH LYRICS

    shoabhanamae ....shoabhanamae  nithyashoabhanamae

    1.girikaarmuka monari0chi
       uramamu naariga bigiyi0chi
       paraga shree hariyanu, baaNamu
       thodigiyu puramulu gelichina puNyunaku
                     (shoabhanamae ....shoabhanamae)
       
    2. giri garba0buna udhayi0chi
       haruni pe0dlaadi moadhamu pe0chi
       surulanu broachi asurula gelichina
       paramapathivratha paarvathiki
                     (shoabhanamae ....shoabhanamae)

    3. tharigo0da hari paadhamuna putti
       thanara mahaeshuni chaepatti
       garimanuloaka loakamulu rakShi0china
       sarasija loachana jaahnaaviki
                     (shoabhanamae ....shoabhanamae)          

    Thursday 8 March 2012

    శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ Sree raama raama (shahanaraagam, Thyagaraju )


      శ్రీరామ   శ్రీరామ శ్రీ మనోహరమ

    1. ఏలరా నీ దయ ఇ0తైన రాదయ           ( 2సార్లు )

    2. చాలదా సదయ సామి తాళదయ         ( 2సార్లు

    3. సర్వము నీవట సత్యరూపుడవట          ( 2సార్లు )

    4. రాగవిరహిత త్యాగరాజనుత                  ( 2సార్లు )

     http://www.4shared.com/music/oNYn2ANB/Sound_clip_334_2.html

    English Lyrics

       shreeraama   shreeraama shree manoaharama

    1. aekaraa nee dhaya i0thaina raadhaya

    2. chaaladhaa sadhaya saami thaaLadhaya

    3. sarvamu neevata sathyaroopudavata

    4. raagavirahitha thyaagaraajanutha


    http://www.4shared.com/music/oNYn2ANB/Sound_clip_334_2.html    

    Tuesday 14 February 2012

    సాయ0కాల సమయ0లో స0ద్యా దీపారాదనలో

     సాయ0కాల సమయ0లో స0ద్యా దీపారాదనలో
    వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి లలితా0బ                 ( సాయ0కాల )

     కాళ్ళకు గజ్జెలు కట్టి0ది ఘల్లు ఘల్లున వచ్చి0ది  
    పిలిచిన వె0టనే వచ్చి0ది అడిగనవన్ని ఇచ్చి0ది                ( సాయ0కాల )

    అ0దరు చేరి రార0డి పూజలు బాగుగ చేయ0డి
    ర0గుల గాజులు తేర0డి  ముతైదువులకు ప0చ0డి             ( సాయ0కాల ) 

    దనములు ఇచ్చిన దనల్లక్ష్మి దన్యము నిచ్చును దనలక్ష్మి
    వరముల్నిచ్చును వరలక్ష్మి స0తనమునిచ్చును సoతానలక్ష్మి    ( సాయ0కాల )

    వజ్రకిరీట0 చూడ0డి   ముత్యాలహార0 చూడ0డి
    నాగాభరణ0చూడ0డి   దేవీ రూప0 కనర0డి                          ( సాయ0కాల )

    English Lyrics

     saaya0kaala samaya0loa
     sa0dhyaa dheepaaraadhanaloa
     vachchenu thalli varalakShmi
     vachchenu thalli lalithaa0ba                   ( saaya0kaala )

     kaaLLaku gajjelu katti0dhi
    ghallu ghalluna vachchi0dhi  
    pilichina ve0tanae vachchi0dhi
    adiganavanni ichchi0dhi                          ( saaya0kaala )

    a0dharu chaeri raara0di
    poojalu baaguga chaeya0di
    ra0gula gaajulu thaera0di
    muthaidhuvulaku pa0cha0di                    ( saaya0kaala ) 

    dhanamulu ichchina dhanallakShmi
    dhanyamu nichchunu dhanalakShmi
    varamulnichchunu varalakShmi    
     sa0thanamunichchunu santhanalakShmi    ( saaya0kaala )

    vajrakireeta0 chooda0di             
     muthyaalahaara0 chooda0di
    naagaabharaNa0chooda0di       
     dhaevee roopa0 kanara0di                     ( saaya0kaala )                                      

    Sunday 12 February 2012

    ఘల్లుఘల్లునా పాద గజ్జెల0దెలు మ్రోగ

    http://musicmazaa.com/MMaPlayer/play/    (same tune)

    ఘల్లుఘల్లునా పాద గజ్జెల0దెలు మ్రోగ
    కలహ0స నడకల కలికీ ఎక్కడికే
    వైకు0ఠ వాసుని పాదపద్మములకు
    భక్తితోనే మరచి పూజ చేయుటకే
    అమ్మా మ0గళ0    జయ మ0గళ0

     పదహారు కళలతో పారాణి ఆరాక
    రమణీ పద్మావతీ పరుగూ లెక్కడికే
    తిరుమలలో నివసి0చేశ్రీ వే0కటేశ్వరుని    
    వైభవము వేడుకలు చూచుటకే
    అమ్మా మ0గళ0 జయ  మ0గళ0      ( ఘల్లుఘల్లునా )     

    పవళి0చే  వేళాయె పట్టుచీరకట్టి
    తలని0డ పూలతో తరుణి ఎక్కడికే
    లోకాల నేలేటి లోకబా0దవునితో
    వుయ్యాల లూగుటకు వెళ్ళీ వస్తా
    మ0గళ0  శుభ మ0గళ0                   ( ఘల్లుఘల్లునా )
        
     ప్రతియేట మా ఇ0ట పూజల0దుకొనుచూ
     దయదలచి దనమిచ్చే  ధనలక్ష్మి నీవే
    ఎల్లపుడూ భ క్తి తో  పూజి0చేవారికి
    వరమూలు ఇచ్చేటి వరలక్ష్మి నీకే
    మ0గళ0 జయమ0గళ0            ( ఘల్లుఘల్లునా )      
                      
    English Lyrics

     ghallugallunaa paadha gajjela0dhelu mroaga
     kalaha0sa nadakala kalikee ekkadikae
    vaiku0Ta vaasuni paadhapadhmamulaku
    bhakthithoanae marachi pooja chaeyutakae
    amma ma0gaLa0

     padhahaaru kaLalathoa paaraaNi aaraaka
     ramaNee padhmaavathee parugoo lekkadikae
     thirumalaloa nivasi0chae   shree vae0kataeshvaruni
    vaibhavamu vaedukalu choochutakae
    ammaa ma0gaLa0 jaya  ma0gaLa0

    pavaLi0chae  vaeLaye pattucheerakatti
    thalani0da poolathoa tharuNi ekkadikkae
    loakaala naelaeti loakabaa0dhavunithoa
    vuyyaala loogutaku veLLI vasthaa
    ma0gaLa0 jaya  ma0gaLa0

    prathiyaeta maa i0ta poojala0dhukonuchoo
    dhayadhalachi dhanamichchae  DhanalakShmi neevae
    ellapudoo chakthithao poojio0chaevaariki
    varamoolu ichchaeti varalakShmi neekae
    ma0gaLa0 jayama0gaLa0


      http://musicmazaa.com/MMaPlayer/play/                 


    Sunday 5 February 2012

    సు0దరకా0డ (one part of the epic Ramayana)

    http://www.4shared.com/account/dir/_KnMQHJy/_online.html?rnd=27

                                                           సు0దరకా0డ

    శ్రీ హను మాను గురుదేవులు నాయెద
    పలికిన సీతా  రామకథ
    నే పలికెద సీతా రామకధ

    (వరుస క్రమముగా చదవవలేను)
    సి0ధుభైరవి
    1) శ్రీ హనుమ0తుడు అ0జనీసుతుడు    అతి బలవ0తుడు రామభక్తుడు
    ల0కకు పోయి రాగల ధీరుడు              మహిమోపేతుడు శత్రు కర్మనుడు
    జా0బవదాది వీరు ల0దరును              ప్రేరెపి0పగ సమ్మతి0చెను
    ల౦కేశ్వరుడు అపహరి0చిన                జానకి మాత జాడ తెలిసికొన
    2) తన త0డ్రి యైన వాయుదేవునకు       సూర్య చ0ద్ర బ్రహ్మాది దేవులకు
    వానరే0ద్రుడు మహే0ద్రగిరిపై               వ0దనములిడె పూర్వాభి ముఖుడై
    రామనామమున పరవశుడయ్యె         రోమ రోమమున పులికితుడయ్యె
    కాయము పె0చె కుప్పి0చి ఎగసె          దక్షిణ దిశగా ల0క చేరగ
    3) పవన తనయుని పదఘట్టనకె          పర్వత రాజము గడగడ వణకె
    ఫలపుష్పాదులు జలజల  రాలె          పరిమళాలు గిరి శిఖరాలు  ని0డె
    పగిలిన శిలల  దాతువు లెగసె            రత్నకాంతులు  నలుదిశల మెరసె
    గుహలను దాగిన భూతములదిరి        ధీనారవముల పరుగిడె బెదిరి.         
                                                                                                 ( శ్రీ హనుమాను )                        
    దర్బారుకానడ
    4)  రఘుకులోత్తముని రామచ0ద్రుని,       పురుషోత్తముని పావనచరితుని
     నమ్మిన బ0టుని అనిలాత్మజుని              శ్రీ హనుమ0తుని స్వాగతమిమ్మని
    నీ కడకొ0త విశ్రా0తి దీసికొని                   పూజల0దుకొని పోవచ్చునని
    సకల ప్రవర్ధితుడు సాగరుడె0తొ                ముదమున పలికె మైనాకునితో
    5)  మైనాకుడు ఉన్నతుడై నిలచె              హనుమ0తుడు ఆగ్రహమునగా0చె
    ఇది  ఒక విఘ్నము కాబోలునని              వారధి పడద్రోసె ఉరముచే గిరిని
    పర్వత శ్రేష్టుడా పోటున క్రు0గె                   పవనతనయుని  బలముగని పొ0గె
    తిరిగి నిలిచె హనుమ0తుని పిలిచె             తన శిఖరముపై నరుని రూపమై        
                                                                                                ( శ్రీ హనుమాను )
          శ్రీ ర0జని
    6)  వానరోత్తమా ఒక సారి నిలుమా             నాశిఖరాల శ్రమ తీర్చుకొనుమా 
    క0దమూలములు ఫలములు తినుమా      నా పూజలుగొని మన్ననల0దుమ
    శతయోజనముల పరిమితము గల             జలనిదినవలీల దాటిపోగల
     నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు                 నీదు త0డ్రి కడు పూజ్యుడు నాకు
           
    7) పర్వతోత్తముని కరమున నిమిరి               పవనతనయుడు పలికెను ప్రీతిని
    ఓ గిరీ0ద్రమా స0తసి0చితిని                         నీ సత్కారము ప్రీతిన0దితిని
    రామకార్యమై ఎఏగు చు0టిని                        సాధి0చువరకు ఆగన౦టిని
    నే పోవలె క్షణమె0తో విలువలె                       నీ దీవెనలె నాకు బలములె              
                                                                                       ( శ్రీ హనుమాను ) 
      మా0డు

    8)  అనాయాసముగ అ0బరవీధిని                  పయనము జేసెడు పవనకుమారుని
    ఇ0ద్రాదులు మహర్షులు  సిధ్దులు                  పులకా0కితులై ప్రస్తుతి0చిరి
    రామకార్యమతి సాహసమ్మని                        రాక్షస బలమతి భయ0కరమని
    కపివరుడె0తటి ఘన తరుడోయని,                 పరిశీలనగా ప0పిరి సురసను

    9) ఎపుడో నన్ను నిన్ను మ్రి0గమని               వరమొసగి మరీ బ్రహ్మ ప0పెనని
    అతిగా  సురస నోటిని దెరచె                            హనుమ౦తు అలిగి కాయము పె౦చె
    ఒకరినొకరు మి౦చి కాయము పె౦చిరి             శతయోజనములు విస్తరి0చిరి          
    పై ను0డి సురలు తహతహలాడిరి                  ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి

    10)సురస ముఖము విశాల మౌటగని            సూక్ష్మ బుద్దిగొని సమయమినదేనని,
    క్షణములోన అ0గుష్టమాత్రుడై                        ముఖము జొచ్చి  వెలివచ్చె విజయుడై
    పవనకుమారుని సాహసముగని                    దీవి0చె సురస నిజరూపముగొని
    నిరాల0బ నీలా0బరము గనుచు                    మారుతి సాగెను వేగము పె0చుచు


    11)జలనిధి తేలె మారుతి ఛాయను                 రాక్షసి సి0హిక అట్టె గ్రహి0చెను
    గుహనుబోలు తన నోటిని తెరిచెను                  కపివరుని గు0జి మ్రి0గ జూచెను
    అ0తట మారుతి సూక్ష్మ రూపమున               సి0హిక ముఖమున చొచ్చి చీల్చెను
    సి0హిక  హృదయము చీలికలాయెను             సాగరమున బఢి అసువులు బాసెను

    12) వారధి దాటెను వాయుకుమారుడు          ల0క చేరెను కార్యశూరుడు
    నలువ0కలను కలయజూచుచు                     నిజరూపమున మెల్లగ సాగుచు
    త్రికూటాచల శిఖరము పైన                            విశ్వ కర్మ వినిర్మితమైన 
     స్వర్గపురముతొ సమానమైన                        ల0కాపురమును మారుతి గా0చెను
                                                                                                        (శ్రీహనుమాను)
    సి0ధుభైరవి               
    13)ఆనిలకుమరుడు రాత్రివేళను                   సూక్ష్మ రూపుడై బయలు దేరెను
    రజనీకరుని వెలుగున తాను                         రజనీచరుల కనుల బడకను
    పిల్లివలె పొ0చి మెల్లగ సాగెను                       ఉత్తర ప్రా కార ద్వారము జేరెను
    ల0కా రాక్షసి కపినరు గా0చెను                    గర్జన సేయుచు ఆడ్డగి0చెను   
             
    14)కొ0డకోనల తిరుగాడు కోతివి                 ఈపురుకి ఏపనికై వచ్చితివి
    ల0కేశ్వరుని ఆనతిమేర                              ల0కాపురికి కావలియున్న
    ల0కను నేను ల0కాధి దేవతను                   నీ ప్రాణములను నిలువున దీతును
    కదలక మెదలక నిజము పల్కుమని            ల0క ఎధుర్కొనె కపికిషోరుని
    15) అతిసు0దరమీ ల0కపురమని               ముచ్చటబడి నే చూడవచ్చితిని
    ఈ మాత్రమునకు కోపమె0దుకులె               పురముగా0చి నే మరలిపోదులె
    ఆని నెమ్మదిగా పలుకగా విని                      అనిలాత్మజుని చులకనగా గొని
    ల0కా రాక్షసి కపికిశోరుని                           గర్జి0చి కసరె గద్ది0చి చరచెను     

    16)సి0హనాదమును మారుతి జేసె             కొ0డ0తగ తనకాయము పె0చె
    వామ హస్తమున పిడికిలి బిగి0చె                ఒకే పోటున ల0కను గూల్చె
    కొ0డ బ0డలా రక్కసి దొల్లె                         కనులప్పగి0చి నోటిని తెరిచె
    అబలను జ0పుట ధర్మముగాదని              ల0కను విడిచె మారుతి దయగొని

     17) ఓ బలభీమా వానరోత్తమా                  నేటికి నీచె ఓటమెరిగితి
    ఈ నా ఓటమి ల0కకు చేటని                      పూర్వమే బ్రహ్మ వరమొసగెనని
    రావణుడాదిగ రాక్షసుల0దరు                    సీత మూలమున అ0తమొ0దెదరు
    ఇది నిజమౌనని మీదె జయమని               ల0కా రాక్షసి  ప0పె హరీశుని      
                                                                                            (శ్రీహనుమాను) 
    కల్యాణి
    18) కోటగోడ అవలీలగ ప్రాకెను                   కపికిశోరుడు లోనికి దుమికెను
    శత్రుపతనముగ వామపాదమును             ము0దుగ మోపెను ము0దుకు సాగెను
    ఆణిముత్యముల  తోరణాలుగల                 రమ్యతరమైన రాజవీదుల
    వెన్నెలలో ల౦కాపురి శోభను                     శోధనగా హరీశుడు గా0చెను 

    19)సువర్ణమయ సౌధరాజముల             ధగధగమెరసె ఉన్నత గృహముల
    కలకలలాడె నవ్వుల జల్లులు                 మ0గళకరమౌ నృత్యగీతములు
    అప్సరసల మరపి0చు మదవతుల         త్రిస్ధాయిబలుకు గాన మాధురులు
    వెన్నెలలో ల0కా పురి శోభను                 శోధనగా హరీశుడు గా0చెను

    20) సు0దరమైన హేమమ0దిరము         రత్న ఖచితమౌ సి0హద్వారము
    పతాకా0కిత ధ్వజాకీర్ణము                       నవరత్న కా0తి స0కీర్ణము
    నృత్య మృద0గ గ0భీర నాదితము           వీణాగాన వినోద స0కులము
    ల0కేశ్వరుని దివ్య భవనమది                  శోధనగా హరీశుడు గా0చెను

    21)అత్తరు పన్నీట జలకములు               కాలాగరు సుగ0ధ ధూపములు,
    స్వర్ణ ఛత్రములు వి0జామరలు                కస్తూరి పునుగు జవ్వాది గ0ధములు,
    నిత్యపూజలు శివార్చనలు                       మాస పర్వముల హామములు,
    ల0కేశ్వేరుని దివ్య భవనమది                   శోదనగా హరీశుడు గా0చెను.
                                                                                                   (శ్రీహనుమాను)
      హి0దోళ0 
    22)యమకుబేర వరుణ దేవే0ద్రాదుల        సర్వస0పదల మి0చినది
    విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది              బ్రహ్మవరమున కుబేరుడ0దినది
    రావణు0డు కుబేరుని రణమ0దు             ఓడి0చి ల0కకు గొని తెచ్చినది
    పుష్పకమను మహావిమానమది             మారుతి గా0చెను అచ్చెరువొ0ది.

    23) నేలను తాకక నిలచియు0డునది       రావణ భవన మద్య0బుననున్నది
    వాయు పథమున ప్రతిష్టితమైనది            మనమున తలచిన రీతి పోగలది
    దివిను0డి భువికి దిగిన స్వర్గమది          సూర్యచ0ద్రులను ధిక్కరి0చునది
    పుష్పకమను మహా విమానమది           మారుతి గా0చెను అచ్చెరువొ0ది.                  

    24) ల౦కాధీశుని ప్రేమమ0దిరము         రత్నఖచితమౌ హేమమ0దిరము
    చ0దనాది సుగ0ధ బ0ధురము              పానభక్ష్య పదార్ధ సమ్రుధ్ధము
    ఆయాపరిమళ రూపానిలయము            అనిలాత్మజుచే ఆఘ్రాణితము 
    పుష్పకమ0దు రావణమ0దిరమ్మది       మారుతి గా0చెను అచ్చెరువొ0ది

    25) మత్తున శయని0చు సుదతుల మోములు      పద్మములనుకొని మూగు భ్రమరములు
    నిమీలిత విశాల నేత్రములు                      నిశాముకుళిత పద్మపత్రములు
    ఉత్తమకా0తల కూడి రావణుడు                   తారాపతి వాలె తేజరిల్లెడు
    పుష్పకమ0దు రావణమ0దిరమ్మది        మారుతిగా0చెను అచ్చెరువొ0ది

    26) రావణు0డు రణమ0దున గెలిచి          స్త్రీలె0దరినో ల0కకు జేర్చెను
    పితృదైత్య గ0ధర్వకన్యలు                         ఎ0దె0దరో రాజర్షి కన్యలు
    సీతదక్క వార0దరు కన్యలె                    రావణుమెచ్చి వరి0చిన వారలె
    పుష్పకమ0దు రావణ మ0దిరమ్మది         మారుతిగా0చెను అచ్చెరువొ0ది
                                                                                               (శ్రీహనుమాను)
    దర్భారుకా0డ
    27) ఐరావతము ద0తపు మొనలతో           పోరున బొడిచిన గ0టులతో
    వజ్రాయుధపు ప్రఘాతములతో                   చక్రాయుదపు ప్రహరణములతో
    జయపర0పరల గురుతులతో                     కీర్తిచిహ్నములకా0తులతో
    ల0కేశుడు శయని0చె కా0తలతో                 సీతకై వెదకె మారుతి ఆశతో 

    28) మినపరాశివలె నల్లనివాడు                   తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
    రక్త చ0దన చర్చిత గాత్రుడు                         స0ధ్యారుణ ఘన తేజోవ0తుడు
    సతులగూడి మధు గ్రోలినవాడు                     రతికేళి సలిపి సోలినవాడు
    ల0కశుడు శయని0చె కా0తలతో                   సీతకై వెదకె మారుతి  ఆశతో

    29) అ0దొక వ0క పర్య0కము జేరి               నిదురి0చుచు0డె డివ్యమనోహరి
    నవరత్న ఖచిత భూషణధారిణి                    నలువ0కలను కా0తి ప్రసారిణి
    స్వర్ణదేహిని చారురూపిణి                            రాణులకు రాణి పట్టపురాణి
    ల0కేశ్వరుని హ్రుదయేశ్వరి                        మ0డోదరి లోకోత్తర సు0దరి

    30) మ0డోదరిని జానకియనుకొని               ఆడుచు పాడుచు గ0తులు పెట్టి
    వాలము బట్టి ముద్దులు పెట్టి                       నేలను గొట్టి భుజములు తట్టి
    స్త0భము లెగసి క్రి0దకు దుమికి                  పల్లటీలు గొట్టి చె0గున చుట్టి,
    చ0చలమౌ కపి స్వభావమును                    పవనతనయుడు ప్రదర్శన జేసెను
                                                                                               (శ్రీహనుమాను)
    శ్రీర0జని
    31) రాముని సీత ఇటులు0డునా( 2సార్లు )   రావణుజేరి శయని0చునా
    రాముని బాసి నిదురి0చునా                        భుజియి0చునా భూషణముల దాల్చునా
    పరమపురుషుని రాముని మరచునా           పరపురుషునితో కాపురము0డునా
    సీతకాదు కాదు కానే కాదని                         మారుతి వగచుచు వెదకసాగెను
    32)పోవగరాని  తావుల బోతి                         చూడగరానివి ఎన్నో జూచితి
    నగ్నముగా పరున్న పరకా0తల                   పరిశీలనగా పరికి0చితిని
    రతికేళి సలిపి సోలిన రమణుల                      ఎ0దె0దరినో పొడగా0చితిని
    ధర్మముగానని పాపినైతినని                         పరితాపముతో మారుతి కృ0గెను
    33) సుదతులతోడ సీతయు0డగ                  వారల జూడక వెదకుటెలాగ
    మనసున ఏమి వికారము నొ0దక                 నిష్కామముగ వివేకము వీడక
    సీతను వెదకుచు చూచితిగాని                      మనసున ఏమి పాపమెరుగనని 
    స్వామి సేవ వరమార్ధముగా గొని                  మారుతి సాగెను సీత కోసమని

    34)భూమీ గృహములు నిశాగృహములు      క్రీడాగృహములు లతాగృహములు
    ఆరామములు చిత్రశాలలు                         బావులు తిన్నెలు రచ్చవీధులు
    మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు                  స0దులు గొ0దులు బాటలు తోటలు
    ఆగిఆగి అడుగడుగున వెదకుచు                  సీతనుగానక మారుతి వగచె

    35) సీతామాత బ్ర తికి యు0డునో                క్రూరరాక్షసుల పాల్పడి యు0డునో
    తాను పొ0దని సీత ఎ0దుకని                     రావణుడే హతమార్చి యు0డునో
    ఆని యోచి0చుచు అ0తట వెదకుచు          తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
    ఆగిఆగి అడుగడుగున వెదకుచు,                సీతను గానక మారుతి వగచె

    36) సీత జాడ కనలేదను వార్తను                తెలిపిన రాముడు బ్రతుక జాలడు
    రాముడు లేనిదే లక్ష్మణుడు0డడు              ఆపై రఘుకుల మ0తయు నశి0చు
    ఇ0తటి ఘోరము  కా0చిన0తనే                  సుగ్రీవాదులు మడియక మానరు
    అని చి0తి0చుచు  పుష్పకము వీడి             మారుతి చేరె ప్రాకారము పైకి

    37)ఇ0త వినాశము నా వల్ల నేను               నే కిష్కి0దకు పోనే పోను
     వాన ప్రస్థాశ్రమ వాసుడనై                           నియమ నిష్టలతో బ్రతుకువాడనై
     సీత మాతను చూచి తీరెదను                      లేకున్న నేను అగ్ని దూకెతను
     అని హనుమ0తుడు కృతనిశ్చయుడై          నలుదెసలగనె సాహసవ0తుడై

    38) చూడ మరచిన అశోకవనమును            చూపు మేరలో మారుతి గా0చెను
    సీతారామ లక్ష్మణాదులకు                           ఏకాదశ రుద్రాది దేవులకు
    ఇ0ద్రాది యమ వాయుదేవులకు                 సూర్య చ0ద్ర మరుద్గణములకు
    వాయున0దనుడు వ0దనములిడి                అశోకవని చేరెను వడివడి
                                                                                                  (శ్రీహనుమాను)
    మోహన  
    39) విరి తేనియలుగ్రోలు భృ0గములు          వి0దారగ జేయు ఝ0కారములు,
     లే చివురాకుల మెసవు కోయిలలు             ప0చమ స్వరముల పలికే పాటలు,
    పురులు విప్పి నాట్యమాడు నెమళులు        కిలకిలలాడే పక్షుల గు0పులు,
    సు0దరమైన అశోకవనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన

    40) కపికిశోరుడు కొమ్మకొమ్మను                ఊపుచు ఊగుచు దూకసాగెను
    పూవులు రాలెను తీవెలు తెగెను                 ఆకులు కొమ్మలు నేలపై బడెను
    పూలు పైరాల పవనకుమారుడు                   పుష్పరథమువలె వనమున దోచెడు
    సు0దరమైన అశోక వనమున                      మారుతి వెదకెను సీతను కనుగొన 

    41) పూవులనిన పూతీవియలనిన               జానకి కె0తో మనసౌనని 
    పద్మపత్రముల పద్మాక్షునిగన                     పద్మాకరముల  పొ0త చేరునని
    అన్నిరీతుల ఆనువైనదని                            అశోకవని సీతయు0డునని
    శోభిల్లు శి0శుపా తరుశాఖలపై                     మారుతి కూర్చొని కలయజూచెను
                                                                                                          (శ్రీహనుమాను)
     సి0ధుభైరవి  
    42) సు0దరమైన అశోక వనమున               తను కూర్చొనిన తరువు క్రి0దున
    క్రు0గి క్రుశి0చిన సన్నగిల్లిన                        శుక్ల పక్షపు చ0ద్రరేఖను
    ఉపవాసముల వాడిపోయిన                        నివురు గప్పిన నిప్పు కణమును
    ఛిక్కిన వనితను మారుతిగా0చెను               రాక్షస వనితల క్రూర వలయమున

    43) మాసిన పీతవసనమును దాల్చిన          మన్నున పుట్టిన పద్జ్మమును
    పతి వియోగ శోకాగ్ని వేగిన                          అ0గారక పీడిత రోహిణిని
    మాటిమాటికి వేడి నిట్టూర్పుల                      సెగలను గ్రక్కె అగ్నిజ్వాలను
    చిక్కిన వనితను మారుతిగా0చెను                రాక్షస వనితల క్రూరవలయమున

     44) నీలవేణి స0చాలిత జఘనను                సుప్రతిష్టను సి0హమద్యమును
    కా0తులొలుకు ఏకా0త ప్రశా0తను              రతీదేవి వలె వెలయు కా0తను
    పుణ్యము తరిగి దివిను0డి జారి                    శోక జలధి పడి మునిగిన తారను
    చిక్కిన వనితను మారుతి గా0చెను               రాక్షస వనితల క్రూరవలయమున

    45) పతి చె0తలేని సతికేలనని                      సీత సొమ్ముల దగిల్చె శాఖల
    మణిమయ కా0చన కర్ణవేష్టములు                మరకత మాణిక్య చె0పసరాలు
    రత్నఖచితమౌ హస్తభూషలు                        నవరత్నా0కిత మణి హారములు
    రాముడు తెలిపిన గురుతులు గలిగిన            ఆభరణముల గుర్తి0చె మారుతి

    46) సర్వ సులక్షణ లక్షత జాత                      సీత గాక మరి ఎవరీ మాత
    కౌసల్య సుప్రజా రాముని                              సీతగాక మరి ఎవరీ మాత
    వనమున తపి0చు మేఘశ్యాముని                సీతగాక మరి ఎవరీ మాత
    ఆహా క0టి కనుగొ0టి సీతనని                       పొ0గి పొ0గి ఉప్పొ0గె మారుతి
                                                                                              (శ్రీహనుమాను) 
     
చక్రవాక0 
    47)పూవులు ని0డిన పొలముల0దున         నాగేటి చాలున జనన మ0దున
    జనక మహారాజు కూతురైన                          దశరథ నరపాలు కోడలైన
    సీతా లక్ష్మికి కాదు సమానము                     త్రైలోక్య రాజ్య లక్ష్మి సహితము
    అ0తటి మాతకా కాని కాలమని                    మారుతి వగచె సీతను కనుగొని
                                                                               
    48) శతృతాపహరుడు మహాశూరుడు           సౌమిత్రికి పూజ్యురాలైన
    ఆశ్రితజన స0రక్షకుడైన                                శ్రీ రఘురాముని ప్రియ సతియైన
    పతి సన్నిధియే సుఖమని యె0చి                  పదునాల్గే0డ్లు వనమున కేగిన
    అ0తటిమాతకా కానికాలమని                       మారుతి వగచె సీతను కనుగొని

    49) బ0గరుమేని కా0తులు మెరయ              మ0దస్మితముఖ పద్మము విరియ
    హ0సతూలికా తల్పమ0దునా                       రామునిగూడి సుఖి0పగ తగిన
    పురుషొత్తముని పావన చరితుని                    శ్రీ రఘురాముని ప్రియ సతియైన
    అ0తటి మాతకా కానికాలమని                      మారుతి వగచె సీతను కనుగొని
                                                                                           (శ్రీ హనుమాను)

    భూపాల0
    50) మూడుజాముల రేయి గడువగ              నాల్గవ జాము నడచు చు0డగ
    మ0గళవాద్య మనోహర ధ్వనులు                ల0కేశ్వరుని మేలు కొలుపులు
    క్రతువులొనర్చు షడ0గ వేదవిధుల             స్వరయుత శబ్ద తర0గ ఘోషలు
    శోభిల్లు శి0శుపా శాఖల0దున                     మారుతి కూర్చొని ఆలకి0చెను

    51) రావణాసురుడు శాస్త్రోక్తముగా                వేకువనే విధులన్ని యొనర్చెను
    మదోత్కటుడై మదనతాపమున                   మరిమరి సీతను మదిలో నె0చెను
    నూర్గురు భార్యలు సురకన్యలవలె                పరిసేవి0పగ దేవే0ద్రుని వలె
    దశక0ఠుడు దేదీప్యమానముగ                    వెడలెను అశోకవనము చేరగ  

    52) ల0కేశునితో వెడలిరి సతులు                మేఘము వె0ట విద్యుల్లతలవలె
    మధువు గ్రోలిన పద్మముఖుల                    ము0గురులు రేగె భ్రు0గములవలె
    క్రీడల తేలిన కామినీమణుల                       నిద్రలేమిపడు ఆడుగులు తూలె
    దశక0ఠుడు దేదీప్య మానముగ                  చేరెను అశోకవనము వేగముగ

    53) ల0కేశుని మహాతేజమునుగని             మారుతి కూడ విభ్రా0తి జె0దెను
    దశక0ఠుడు సమీపి0చి నిలిచెను                 సీతపైననే చూపులు నిలిపెను
    తొడలు చేర్చుకొని కడుపును దాచి              కరములు ముడిచి చనుగవ గాచి
    సుడిగాలిపడిన కదళీతరువువలె                 కటిక నేలపై జానకి తూలె
                                                                                              (శ్రీ హనుమాను)         
     
కళ్యాణి 
    54)ఓ సీతా ఓ పద్మనేత్ర,                             నా చె0త నీకు ఏల చి0త
    ఎక్కడిరాముడు ఎక్కడి అయోద్య                ఎ0దుకోసమీ వనవాస వ్యథ
    నవయవ్వన త్రిలోక  సు0దరి                      నీ కె0దుకు యీ ముని  వేషధారి
    అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికే

                                                                                   
    55) రాముడు నీకు సరిగాని వాడు               నిను సుఖపెట్టడు తను సుఖపడడు
    గతిచెడి వనమున తిరుగు చు0డెను            తిరిగి తిరిగి తుదకు రాలి పోయెను
    మరచి పొమ్ము  కొరగాని రాముని               వలచి రమ్మునను యశో విశాలుని
    అని రావణుడు కామా0ధుడై నిలిచె              నోటికి వచ్చిన దెల్ల పలికె

    56) రాముడు వచ్చుట నన్ను గెల్చుట         నిన్ను పొ0దుట కలలోని మాట
    బల విక్రమ ధన యశముల0దున                అల్పుడు రాముడు నా ము0దె0దున
    యమకుబేర యి0ద్రాది దేవతల                   గెలిచిన నాకిల నరభయమేల
    అని రావణుడు కామా0ధుడై నిలిచె               నోటికి వచ్చిన దెల్ల పలికె
                                                                                                 (శ్రీ హనుమాను)           
    శ్రీరాగ0  
    57) నిరతము పతినే మనమున దలచుచు      క్షణమొక యుగముగ కాలము గడుపుచు
    రావణగర్వ మద0బుల ద్రు0చు                       రాముని శౌర్య ధ్రైర్యముల దలచుచు
    శోకతప్తయై శిరమును వ0చి                           తృణమును ద్రు0చి తన ము0దు0చి
    మారు పల్కె సీత దీన స్వరమున                    తృణముకన్న రావణుడే హీనమన

    58) రామలక్షణులు లేని సమయమున           అపహరి0చితివె నను ఆశ్రమమున
    పురుష సి0హముల గాలికి బెదిరి                    పారిపోతిని శునకము మాదిరి
    యమకుబేర యి0ద్రాది దేవతల                      గెలిచిన నీకీ వ0చన లేల
    అని పల్కె సీత దీన స్వరమున                       తృణముకన్న రావణుడే హీనమన    

    59) ఓయి రావణా నా మాట వినుము              శ్రీరామునితో వైరము మానుము
    శీఘ్రముగా నను రాముని జేర్చుము                త్రికరణ శుద్ధిగా శరణు వేడుము
    నిను మన్ని0చి అనుగ్రహి0పుమని                  కోరుకొ0దునా కరుణామూర్తిని
    అని పల్కె సీత దీన స్వరమున                        తృణము కన్న రావణుడే హీనమన 
                                                                                                      (శ్రీ హానుమాను)
    కల్యాణి 
    60) ఓ సీతా నీ వె0త గడసరివె                        ఎవరితో ఎమి పల్కుచు0టివె
    ఎ0తటి కర్ణకఠోర వచనములు                         ఎ0తటి ఘోర అసభ్య దూషణలు
    నీపై మోహము నను బ0ధి0చెను                    లేకున్న నిను వధి0చి యు0దును
    అని గర్జి0చెను ఘనతరగాత్రుడు                      క్రోధో దీప్తుడై దశక0ఠుడు  

    61) నీ కొసగిన ఏడాది గడువును                    రె0డు నెలలలో తీరి పోవును
    అ0తదనుక నిన్న0టగ రాను                          ఈలోపున బాగోగులు కనుగొను
    నను కోరని నిను బలాత్కరి0చను                    నను కాదను నిను కనికరి0చను
    అని గర్జి0చెను ఘనతర గాత్రుడు                     క్రోధో దీప్తుడై దశక0ఠుడు

    62) ఓ రావణా నీక్రొవ్విన నాలుక                     గిజ గిజలాడి తెగిపడదేమి
    కామా0ధుడా నీ క్రూర నేత్రములు                   గిరగిర తిరిగి రాలి పడవేమి
    పతి ఆగ్ఞలేక యిటులు0టిగాని                       తృటిలో నిన్ను దహి0పనా ఏమి
    అని పల్కె సీత దివ్యస్వరమున                      తృణముకన్న రావణుడే హీనమన

    63) క్రోధాగ్ని రగుల రుసరుసలాడుచు    కొరకొర జూచుచు నిప్పులు గ్రక్కుచు
    తన కా0తలెల్ల కలవర మొ0దగ            గర్జన సేయుచు దిక్కులదరగ
    సీత నెటులైన ఒప్పి0చుడని                  ఒప్పుకొననిచో భక్షి0చుడని
    రావణాసరుడు అసుర వనితలను          ఆజ్ఞాపి0చి మరలి పోయెను
                                                                                        (శ్రీహనుమాను)
    దర్బారుకానడ  
    64) అ0దున్న ఒక వృద్ధ రాక్షసి             తోటి రాక్షసుల ఆవల త్రోసి
    కావలెనన్న నన్ను వధి0పుడు             సీతను మాత్రము హి0సి0పకుడు
    దారుణమైన కలగ0టి నేను                   దానవులకది ప్రళయ0బేను
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పిత లైరి రాక్షసిగణము      

    65) శుక్లా0బరములు దాల్చిన వారు       రామలక్ష్మణులు అగుపి0చినారు
    వైదేహికి యిరువ0కల నిలచి                  దివ్య తేజమున వెలుగొ0దినారు
    తెల్లని కరిపై మువ్వురు కలసి                 ల0కా పురిపై పయని0చినారు
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము     భయక0పితలైరి రాక్షసే  గణము,

    66) దేవతల0దరు పరిసేవి0ప                ఋషిగణ0బులు అభిషేకి0ప
    గ0ధర్వాదులు స0కీర్తి0ప                      బ్రహ్మాదులు మునుము0దు స్తుతి0ప
    సీతా రాముడు విష్ణుదేవుడై                  శోభిల్లెను కోటి సూర్య తేజుడై
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీ గణము                                                 

    67) తైలమలదుకొని రావణాసురుడు     నూనె ద్రాగుచు అగుపి0చినాడు
    కాలా0బరమును ధరియి0చినాడు         కరవీరమాల దాల్చినాడు
    పుష్పకమ0దు0డి నేలబడినాడు           కడకొక స్త్రీచే యీడ్వబడినాడు
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము    భయక0పితలైరి రాక్షసీగణము

    68) రావణు0డు వరాహముపైన            కు0భ కర్ణుడు ఒ0టెపైన
    ఇ0ద్రజిత్తు మకరముపైన                     దక్షిణ దిశగా పడిపోయినారు
    రాక్షనుల0దరు గు0పుగు0పులుగ       మన్నున కలిసిరి సమ్మూలమ్ముగ
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము   భయ క0పితలైరి రాక్షసీ గణము 

    69)తెల్లని మాలలు వలువలు దాల్చి    తెల్లని గ0ధము మేనబూసికొని
    నృత్య మృద0గ మ0గళా ధ్వనులతో     చ0ద్రకా0తులెగజిమ్ము ఛత్రముతో
    తెల్లని కరిపై మ0త్రి వర్యులతో              వెడలె విభీషణుడు దివ్య కా0తితో
    అని తెల్పె త్రిజట స్వప్న వృత్తా0తము  భయక0పితలైరి రాక్షసీ గణము

    70) విశ్వకర్మ నిర్మి0చిన ల0కను        రావణు0డు పాలి0చెడు ల0కను
    రామదూత ఒక వారరోత్తముడు          రుద్రరూపుడై దహియి0చినాడు
    ప్రళయ భయానక సదృశమాయెను    సాగరమున ల0క మునిగిపోయెను
    అని పల్కు త్రిజట మాటలు వినుచు    నిద్ర తూగిరి రాక్షస వనితలు  

    71) హృదయ తాపమున జానకి తూలుచు        శోక భారమున గడగడ వణకుచు
    జరిగి జరిగి అశోక శాఖలను                             ఊతగా గొని మెల్లగ నిలచి
    శ్రీరాముని కడసారి తలచుకొని                         తనమెడ జడతో వురిబోసుకొని
    ప్రాణత్యాగము చేయబూనగా                           శుభశకునములు తోచె వి0తగా
                                                                                                     (శ్రీహనుమాను)
    శుభప0తువరాళి 
    72) సీతకె0త దురవస్థ ఘటిల్లె                       నా తల్లినెటుల వూరడి0చవలె
    నన్ను నేనెటుల తెలుపుకోవలె                      తల్లి నెటుల కాపాడు కోవలె
    ఈ మాత్రము నే ఆలసి0చినా                         సీతా మాత ప్రాణములు0డునా
    అని హనుమ0తుడు శాఖల మాటున            తహ తహలాడుచు మెదలసాగెను 

    73) ననుగని జానకి బెదరక ము0దే            పలికెద సీతా రామకథ
    సత్యమైనది వ్యర్థముగానిది                        పావనమైనది శుభకరమైనది
    సీతామాతకు కడుప్రియమైనది                   పలుకు పలుకున తేనెలొలుకునది
    అని హనుమ0తుడు మృదుమధురముగ   పలికెను సీతారామకధ

    74) దశరధ విభుడు రాజోత్తముడు             యశము గొన్న యిక్ష్వాకు వ0శజుడు
    దశరధునకు కడు ప్రియమైన వాడు           జేష్టకుమారుడు శ్రీ రఘురాముడు
    సత్యవ0తుడు జ్ఞాన శ్రేష్టుడు                      పితృవాక్య పరిపాలన శీలుడు
    అని హనుమ0తుడు మృదుమధురముగ  పలికెను సీతా రామకథ    

    75)శ్రీరాముని పట్టాభిషేకము                        నిర్ణయమైన శుభసమయమున
    చిన్న భార్య కైక దశరధు చేరి                         తన కొసగిన రె0డు వరములు కోరె
    భరతునకు పట్టాభిషేకము                            పదునాల్గే0డ్లు రామ వనవాసము
    అని హనుమ0తుడు మృదు మధురముగ     పలికెను సీతా రామకథ

    76) త0డ్రి మాట నిలుప రామచ0ద్రుడు          వల్కల ధారియై రాజ్యము వీడె
    సీతా లక్ష్మణులు తనతో రాగ                         పదునాల్గే0డ్లు వనవాస మేగె
    ఖరదూషణాది పదునాల్గువేల                       అసురుల జ0పె జన స్థానమున
    అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతారామకథ  

    77) రాముడు వెడలె సీత కోర్కెపై                  మాయలేడిని కొని తెచ్చుటకై
    రామ లక్ష్మణులు లేని సమయమున            అపహరి0చె ల౦కేశుడు సీతను
    సీతనుగానక రామచ0ద్రుడు                         అడవుల పాలై వెదకు చు0డెను
    అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతా రామకథ

    78) రామ సుగ్రీవులు వనమున గలిసిరి         మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి
    శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను               సుగ్రీవుని కపిరాజుగ జేసెను
    సుగ్రీవునాన ల0క చేరితి                               సీతామాతను కనుగొన గలిగితి
    అని హనుమ0తుడు మృదుమధురముగ      పలికెను సీతరామకథ    

    79) వానరోత్తముడు పలుకుట మానెను         జానకి కె0తో విస్మయమాయెను
    భయము భయముగ నలువ0కలు గని         మెల్లగ మోమెత్తి పైకి చూచెను
    శోభిల్లు శి0శుపా శాఖల0దున                      బాలార్కుని వలె మారుతి తోచెను
    మారుతి రూపము చిన్నదైనను                    తేజోమయమై భీతిగొల్పెను
                                                                                            (శ్రీహనుమాను)

    వలజి 
    80) తల్లీ తెల్పుము నీవు ఎవరవో                  దేవ గ0ధర్వ కిన్నరా0గనవో
    కా0తులు మెరసే బ0గరు మేన                    మలినా0బరమేల తాల్చితివో
    ఓ కమలాక్షి నీ కనుదోయి                            నీలాలేల ని0పితివో
    అని హనుమ0తుడు తరువు ను0డి దిగి        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె     

    81) రావణాసురుడు అపహరి0చిన              రాముని సతివో నీవు సీతవో
    రామలక్ష్మణులు వనమున వెదకెడు           ఆవనీ జాతవో నీవు సీతవో
    సర్వ సులక్షణ లక్షిత జాతవు                     తల్లీ తెల్పుము నీవు ఎవరవో
    అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

    82) జనక మహీపతి ప్రియ పుత్రికను          దశరధ మహిపతి పెద్ద కోడలను
    శ్రీ రఘురాముని ప్రియసతి నేను                సీతయను  పేర వరలు దానను
    పరిణయమైన పది రె0డేడులు                   అనుభవి0చితిమి భోగభాగ్యములు
    అని పల్కె సీత వానరే0ద్రునితో                  రామకథను కీర్తి0చిన వానితో 

    83) రావణుడొసగిన ఏడాది గడువు                    రె0డు నెలలలో యిక తీరిపోవు
    రాముడు నన్ను కాపాడునని                            వేచివేచి వేసారి పోతిని
    అసురులు నన్ను చ0పక మున్నె                      నాకై నేను పోనె0చితిని
    అని పల్కె సీత వానరే0ద్రునితో                          రామకథను కీర్తి0చిన వానితొ

    84) అమ్మా సీతా నమ్ముము నన్ను                  రాముని దూతగ వచ్చినాడను
    రామలక్ష్మణులు క్షేమమన్నారు                       నీ క్షేమ మరసి రమ్మన్నారు
    రాముడు నీకు దీవెనల0పె                               సౌమిత్రి నీకు వ0దనములిడె
    అని హనుమ0తుడు సీతతో పలికె                    అ0జలి ఘటి0చి ము0దుకు జరిగె

    85) మారుతి ఎ0తగ ము0దుకు జరిగెనో           జానకి అ0తగ అనుమాని0చెను
    రావణాసురుడె ఈ వానరుడని                         కామరూపుడై వచ్చి యు0డునని
    ఆశ్రమమున ఒ0టిగనున్న తనను                  వ0చి0చిన సన్యాసి యీతడని
    తల వాల్చుకొని భయక0పితయై                     కటిక నేలపై జానకి తూలె

    86) వానర రాజు సుగ్రీవుని మ0త్రిని                నన్ను పిలుతురు హనుమ0తుడని
    రామ సుగ్రీవులు మిత్రులైనారు                      నీ జాడ తెలియ వేచియున్నారు
    రామ లక్ష్మణులు వానర రాజుతో                    ల0క చేరెదరు వానర కోటితో
    అని హనుమ0తుడు సీతతో పలికె                  అ0జలి ఘటి0చి చె0తన నిలిచె
                                                                                                   (శ్రీహనుమాను)
    హి0దోళ0 
    87) ఓ హనుమ0తా హాయి బొ0దితిని           నీ పలికిన శ్రీరామకథ విని
    రామలక్ష్మణుల ఎట్లెరిగితివి                          రూపురేఖలను ఎట్లు గా0చితివి
    వారి మాటలను ఎట్లు వి0టివి                      వారి గుణములను ఎట్లు తెలిసితివి
    అని పల్కె సీత హనుమ0తునితో                 రామకథను కీర్తి0చిన వానితో
    88) సర్వ జీవన స0ప్రీతి పాత్రుడు                 కమలనేత్రుడు దయాసా0ద్రుడు
    బుద్ధియ0దు బృహస్పతి సముడు               కీర్తియ0దు దేవే0ద్రుని సముడు
    క్షమాగుణమున పృధివీ సముడు               సూర్య తేజుడు శ్రీ రఘురాముడు
    అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

    89) అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు      అన్నిట రాముని సరిపోలువాడు
    అన్నకు తోడు నీడయై చెలగెడు                   అజేయుడు శతృ భయ0కరుడు
    సామాన్యులు కారు సోదరులిరువురు          నిన్ను వెదకుచు మమ్ము కలసినారు
    అని హనుమ0తుడు సీతతో పలికె               అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

    90) పవన కుమారుని పలుకులను విని      అతడు నిజముగా రామదూతయని
    ఆన0దాశ్రులు కన్నులు ని0డగ                 చిరునగవులతో జానకి చూడగ
    ఇదిగో తల్లి  ఇది తిలకి0పుము                   రాముడ0పిన అ0గుళీయకము
    అని హనుమ0తుడు భక్తి మీరగను            అ0గుళీయకమును సీత కొసగెను
                                                                                           (శ్రీ హనుమాను)
    ద్విజావ0తి
    91) రామచ0ద్రుని ముద్రిక చేకొని             ఆశ్రులు ని0డిన కనుల కద్దుకొని
    మధుర స్మృతులు మదిలో మెదల           సిగ్గు చేత తన శిరము వ0చుకొని
    ఇన్ని రోజులకు తనకు కలిగిన                 శుభశకునముల విశేషమనుకొని
    జానకి పల్కె హనుమ0తునితో                స0పూర్ణమైన విశ్వాసముతో

    92) ఎన్నడు రాముడు ఇటకే తె0చునో      ఎన్నడు రావణుని హతము సేయునో
    లక్ష్మణు0డు తన అగ్ని శరములతో          క్రూర రాక్షసుల రూపుమాపునో
    సుగ్రీవుడు తన వానర సేనతో                  చుట్టుముట్టి యీ ల0కను గూల్చునో
    అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో                                                                                            
    93) రామలక్ష్మణులు వచ్చు దాకను       బ్రతుకనిత్తురా అసురులు నన్ను
    రావణుడొసగిన ఏడాది గడువు               రె0డు నెలలలో యిక తీరిపోవు
    ప్రాణములను అరచేత నిల్పుకొని           ఎదురుచూతు నీ రె0డు మాసములు
    అని పల్కె సీత హనుమ0తునితో          స0పూర్ణమైన విశ్వాసముతో

    94) నీ వలెనె శ్రీ రామచ0ద్రుడు             నిద్రాహారములు మరచెనమ్మా
    ఫల పుష్పాదులు ప్రియమైనవిగని        హా సీతాయని శోకి0చునమ్మా
    నీ జాడ తెలిసి కోద0డ పాణి                  తడవు సేయకే రాగలడమ్మా
    అని హనుమ0తుడు సీతతోపలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె  

    95) ఓ హనుమ0తా నినుగనిన0త       నాలో కలిగె ప్రశా0తత కొ0త
    వానరోత్తమా నిను వినిన0త                నే పొ0దితిని ఊరట కొ0త
    రాముని వేగమె రమ్మని తెల్పుము      రె0డు నెలల గడువు మరువబోకుము
    అని పల్కె సీత హనుమ0తునితో         స0పూర్ణమైన విశ్వాసముతో
                                                                                              (శ్రీ హనుమాను)

    కల్యాణి  
    96) తల్లీ నీవిటు శోకి0పనేల                వగచి వగచి యిటు భీతిల్లనేల
    ఇపుడే నీకీ చెర విడిపి0తును             కూర్చు0డుము నామూపు మీదను
    వచ్చిన త్రోవనే కొని పోయెదను           శ్రీ రామునితో నిను చెర్చెదను
    అని హనుమ0తుడు సీతతోపలికె        అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

    97) పోనివ్వక పోతివిగా హనుమ              సహజమైన నీ చె0చల భావము
    అరయగ అల్ప శరీరుడ వీవు                    ఏ తీరుగ నను గొనిపోగలవు
    రాముని కడకే నను చేర్చెదవో                  కడలిలో ననే జార విడుతువో
    అని పల్కె సీత హనుమ0తునితో             తనలో కలిగిన వాత్సల్యముతో

    98) సీత పలికిన మాటల తీరును             హనుమ0తుడు విని చిన్నబోయెను
    సీత చె0త తన కామరూపమును             ప్రదర్శి0పగ స0కల్పి0చెను
    కొ0డ0తగ తన కాయము బె0చెను          కా0తి వ0తుడై చె0త నిలచెను
    జయ హనుమ0తుని కామరూపమును   ఆశ్చర్యముతో జానకి చూచెను

    99) అద్భుతమౌ నీ కామరూపమును      కా0చితినయ్యా శా0తి0పుమయ్యా
    పవన కుమారా నీవుగాకమరి                 ఎవరీ వారిధి దాటెదరయ్యా
    క్రూర రాక్షసుల క0టబడకయే                 ల0క వెదకినను కనగలరయ్యా
    అని పల్కె సీత హనుమ0తునితో            స0పూర్ణమైన విశ్వాసముతో
                                                                                           (శ్రీ హనుమాను)

    సి0ధుభైరవి 
    100) తల్లీ నేను నీయ0దుగల                భక్తి భావమున అటుల తెల్పితి
    క్రూర రాక్షనుల బారిను0డి నిను            కాపాడనె0చి అటుల పల్కితి
    వేగమె నిన్ను రాముని చేర్చెడు             శుభగడియలకై త్వరపడిపల్కితి
    అని హనుమ0తుడు సీతతో పలికె          అ0జలి ఘటి0చి చె0తన నిలిచె   

    101) తల్లీ నీవు తెలిపినవన్నీ                     శ్రీరామునకు విన్నవి0చెదను
    సత్య ధర్మ పవిత్ర చరిత్రవు                         శ్రీరామునకు తగిన భార్యవు
    అమ్మాయిమ్ము ఏదో గురుతుగ                 శ్రీరాముడు గని ఆన0ది0పగ
    అని హనుమ0తుడు సీతతో పలికె             అ0జలి ఘటి0చి చె0తన నిలిచె

    102) చిత్ర కూటమున కాకాసురుకధ         కన్నీరొలుకగ గురుతుగ తెలిపి
    చె0గుముడి నున్న చూడమణిని               మెల్లగ తీసి మారుతి కొసగి
    పదిలముగా కొని పోయి రమ్మని               శ్రీ రామునకు గురుతుగనిమ్మని
    ప్రీతి బల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో 

    103) చేతులారగ చూడామణిగొని              ఆన0దముగ కనుల కద్దుకొని
    వైదేహికి ప్రదక్షిణలు జేసి                           పదముల వ్రాలి వ0దనములిడి
    మనమున రాముని ధ్యాని0చుకొని            మరలిపోవగ అనుమతిగైకొని
    అ0జనీ సుతుడు కాయము బె0చె              ఉత్తర దిశగా కుప్పి0చి ఎగసె
                                                                                    (శ్రీ హనుమాను)
    మా0డు 
    104) సీత జాడగని మరలిన చాలదు          చెయవలసినది యి0కను కలదు
    కల్పి0చుకొని కలహము పె0చెద               అసుర వీరుల పరిశీలి0చెద
    రాక్షసబలముల శక్తి గ్రహి0చెద                 సుగ్రీవాదులకు విన్నవి0చెద
    అని హనుమ0తుడు యోచన జేయుచు   తోరణ స్త0భము పైన నిల్చెను  

    105) పద్మాకరముల పాడొనరి0చి            జలాశయముల  గట్టులు త్రె0చి
    ఫల వృక్షముల నేలను గూల్చి                ఉద్యానముల రూపును మాపి
    ప్రాకారముల బ్రద్దలు చేసి                        ద్వార బ0ధముల ధ్వ0సము చేసి
    సు0దరమైన అశోకవనమును                చి0దరవ0దర చేసె మారుతి

    106) మృగసమూహములు భీతిల్లినవై    తత్తరపాటుగ పరుగులు తీయగ
    పక్షుల గు0పులు చెల్లాచెదరై                  దీనారవముల ఎగిరి పోవగ
    సీతయున్న శి0శుపాతరువు వినా         వనమ0తయు వినాశము కాగా
    సు0దరమైన అశోకవనమును               చి0దర వ0దర చేసె మారుతి   

    107)వనమున రేగిన ధ్వనులకు అదిరి     ల0కావాసులు నిద్ర లేచిరి
    కావలియున్న రాక్షస వనితలు                రావణుచేరి విన్నవి0చిరి
    దశక0ఠుడు మహోగ్రుడై పల్కె               వానరుని బట్టి ద0డి0పుడనే
    ఎనుబదివేల కి0కర వీరులు                    హనుమ0తునిపై దాడి వెడలిరి

    108) ఎనుబదివేల కి0కర వీరుల             ఒక్క వానరుడు హతము చేసెను
    ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను
    జ0బు మాలిని తగిన బలముగొని           ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను
    జ0బుమాలి ప్రహస్తుని సుతుడు             హనుమ0తునిపై దాడి వెడలెను
                                                                                        (శ్రీ హనుమాను)
    కల్యాణి  
    109) జ0బు మాలిని సర్వ సైన్యమును    ఒక్క వానరుడు ఉక్కడ గి0చెను
    ఈ వృత్తా0తము వినిన రావణుడు           నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపి0చెను
    మ0త్రి కుమారుల తగిన బలముగొని      ఆ వానరుని ద0డి0పగ పొమ్మనె
    మ0త్రి కుమారులు ఏడ్గురు చేరి              హనుమ0తునిపై దాడి వెడలిరి

    110) మ0త్రి సుతులను సర్వ సైన్యమును   మారుతి త్రుటిలో స0హరి0చెను
    ఎటు జూచినను మృతదేహములు               ఎటు పోయినను రక్తపుటేరులు
    ఈ వృత్తా0తము వినిన రావణుడు               కొ0త తడవు యోచి0చి పల్కెను
    సేనాపతులను తగిన బలముగొని               ఆ వానరుని ద0డి0ప పొమ్మనెను                             

    111) సేనాపతులను సర్వ సైన్యమును        పవన కుమారుడు నిర్మూలి0చెను
    ఈ వృత్తా0తము వినిన రావణుడు               నిశ్చేష్టితుడై పరివీక్షి0చెను
    త0డ్రి చూపులు తనపై సోకగ                      అక్షకుమారుడు దిటవుగ నిలువగ
    రావణు0డు పల్కె కుమారుని గని               ఆ వానరుని ద0డి0ప పొమ్మని
                                                                                                (శ్రీ హనుమాను)
    సి0ధుభైరవి  
    112) అక్షకుమారుడు నవయౌవ్వనుడు       వేగవ0తుడు తేజోవ0తుడు
    దివ్యాస్త్రములను పొ0దినవాడు                    మణిమయస్వర్ణ కిరీట శోభితుడు
    కాలగ్ని వోలె ప్రజ్వరిల్లెడు                            రణధీరుడు మహావీరుడు
    అక్షకుమారుడు దివ్య రధముపై                   దాడి వెడలెను హనుమ0తునిపై          

    113) మూడు శరములతో మారుతి శిరమును     పది శరములతో మారుతి ఉరమును
    అక్షకుమారుడు బలముగ నాటెను                     రక్తము చి0దగ గాయపరచెను
    ఉదయ భాస్కర సమాన తేజమున                     మారుతి ఎగసె గగన మార్గమున
    ఇరువురి నడుమ భీకరమైన                              పోరు చెరేగె ఆకాశమున

    114) అతినేర్పుతోడ రణము సల్పెడు                 అక్షకుమారుని మారుతి దయగొని
    బాలుని చ0పగ చేతులు రావని                         వేచి చూచెను నిగ్రహి0చుకొని
    అక్షకుమారుడు అ0తక0తకును                        అగ్ని హోత్రుడై రణమున రేగెను
    ఇరువురి నడుమ భీకరమైన                             పోరు చెలరేగె ఆకాశమున

    115) అగ్ని కణమని జాలికూడదని                    రగులక మునుపే ఆర్పుట మేలని
    సి0హనాదమును మారుతి జేసెను                   అరచేత చరచి హయములజ0పెను
    రథమును బట్టి విరిచివేసెను                            అక్షుని ద్రు0చి విసరివేసెను
    అక్షుని మొ0డెము అతి ఘోరముగ                  నేలపై బడె రక్తపుముద్దగ

    116) అక్షకుమారుని మరణవార్త విని                ల0కేశ్వరుడు కడు దుఖి0చెను
    మెల్లగ తేరి క్రోధము బూని                               తన కుమారుని ఇ0ద్రజిత్తుగని
    ఆ వానరుడు సామాన్యుడు గాడని                    వానిని వేగ బ0ధి0చి తెమ్మని
    రావణాసురుడు ఇ0ద్రజిత్తును                       హనుమ0తునిపై దాడి ప0పెను

    117) కపికు0జరుడు భయ0కరముగ               కాయము పె0చి సమరము సేయగ
    ఈ వానరుడు సామాన్యుడు గాడని                   మహిమోపేతుడు కామరూపుడని
    ఇ0ద్రజిత్తు బహుయోచన జేసి                         భ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె
    దేవగణ0బులు స0గ్రామముగని                      తహతహలాడిరి ఏమగునోయని

    118)భ్రహ్మాస్త్రముచే  బ0ది0పబడి                     పవనకుమారుడు నేలపై బడె
    వనజభవుడు తనకు ఒసగిన వరము              స్మరియి0చుకొని ప్రార్ధన చేసె
    వాయు, బ్రహ్మ ఇ0ద్రాది దేవతల                       కాపాడుమని ధ్యానము చేసె
    దేవగణ0బులు స0గ్రామముగని                     తహతహలాడిరి ఏమగునోయని 

    119) కట్టుపడియున్న వానరోత్తముని             అసురులు తలచిరి తమకులొ0గెనని
    త్వరత్వరగా దానవులు దరిచేరి                      నార చీరలతో బిగి బ0ధి0చిరి
    బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బ0ధము                  క్షణకాలములో తొలగిపోయెను
    మారుతి మాత్రము నారచీరలకే                      కట్టుపడినటుల కదలకయు0డె

    120) వానరోత్తముని దూషణలాడుచు             రావణుకడకు ఈడ్చుకు బోవగ
    ఈవానరుని వధి0చి వేయుడని                      మనయెడ ద్రోహము చేసినాడని
    రక్తనేత్రముల నిప్పులు రాలగ                          ల0కేశ్వరుడు గర్జన సేయగ
    రావణుతమ్ముడు విభీషణుడు                       దూతను చ0పుట తగదని తెల్పెను
                                                                                                   (శ్రీ హనుమాను)   
    మోహన 
    121) అన్నా రావణ తెలిసినవాడవు         శా0తముగా నా మనవిని వినుమా
    దూతను జ0పుట ధర్మముగానిది           లోకముచే గర్హి0పబడునది
    శూరుడవైన నీకు తగనిది                       రాజధర్మ విరుద్ధమైనది
    అని విభీశణుడు ల0కేశునితో                  దూతను చ0పుట తగదని తెల్పెను

    122) అన్నా వీనిని వధి0పకుమా            తగురీతిని ద0డి0చి ప0పుమా
    దూతయెడల విధి0పబడినవి                  వధగాక తగిన ద0డనలున్నవి
    తల గొరిగి0చుట చబుకు వేయుట           గురుతువేయుట వికలా0గు సేయుట
    ఆని విభీశణుడు ల0కేశునితో                 దూతనుచ0పుట తగదని తెల్పెను
                                                                                               (శ్రీ హనుమాను)                   
    మా0డు 
    123) కపులకు జ వాలము ప్రియభూషణము        కావున కాల్చుడు వీని వాలము
    వాడవాడల ఊరేగి0పుడు                               పరాభవి0చి వదలి వేయుడు
    కాలిన తోకతో వీడేగుగాక                                అ0పిన వారికి తలవొ0పుగాగ
    అని రావణుడు విభీషణుని గని                       ఆజ్ఞాపి0చెను కోపమణుచుకొని

    124) జీర్ణా0బరములు అసురులు దెచ్చిరి        వాయుకుమారుని తోకకు జుట్టిరి
    నూనెతో తడిపి నిప్ప0టి0చిరి                         మ0టలు మ0డగ స0తసి0చిరి
    కపికు0జరుని యీడ్చుకుబోయిరి                  నడివీధులలో ఊరేగి0చిరి
    మారుతి మాత్రము మిన్నకు0డెను                సమయము కాదని సాగిపోయెను

    125) కపిని బ0ధి0చి తోక గాల్చిరని                నడివీధులలో త్రిప్పుచు0డిరని
    రాక్షసవనితలు వేడుక మీరగ                         పరుగున పోయి సీతకు తెలుపగ
    అ0తటి ఆపద తన మూలమున                    వాయుసుతునకు వాటిల్లెనని
    సీతామాత కడు చి0తి0చెను                           అగ్ని దేవుని ప్రార్ధన చేసెను


    126) ఓర్వరానివై మ0డిన మ0టలు               ఒక్కసారిగా చల్లగ దోచెను
    అగ్ని దేవునకు నా జనకునకు                       అన్యోన్యమైన మైత్రి చేతనో
    రామదూతనై వచ్చుట చేతనో                         సీతామాత మహిమ చేతనో
    మ0డే జ్వాలలు పిల్లగాలులై                          వీవసాగెనని మారుతి పొ0గెను                            

    127) ఆన0దముతో కాయముబె0చెను           బ0ధములన్నీ తెగిపడిపోయెను
    అడ్డగి0చిన అసురుల0దరిని                           అరచేత చరచి అట్టడగి0చెను
    గిరిశిఖరమువలె ఎత్తుగనున్న                       నగరద్వార గోపురమ0దున
    స్త0భము పైకి మారుతి ఎగసెను                     ల0కాపురమును పరివీక్షి0చెను
                                                                                                  (శ్రీ హనుమాను) 

    సి0ధుభైరవి  
    128) ఏ మ0టల నా వాలము గాల్చిరో            ఆ మ0టలనే ల0క గాల్తునని
    భీమరూపుడై గర్జన సేయుచు                        రుద్ర రూపుడై మ0టల జిమ్ముచు
    మేడ మిద్దెల వనాల భవనాల                        వెలిగి0చెను జ్వాలా తోరణాల
    చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                      ఘన విఖ్యాతి గడి0చె మారుతి  

    129) ఒకచో కు0కుమ కుసుమ కా0తుల      ఒక ఎడ బూరుగు పుష్పచ్ఛాయల
    ఒకచో మోదుగు విరుల తేజముల                ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల
    కోటిసూర్య సమాన కా0తుల                        ల0కా పురము రగిలెను మ0టల
    చూచి రమ్మనిన కాల్చి వచ్చిన                     ఘన విఖ్యాతి గడి0చె మారుతి
                                                                                              (శ్రీ హనుమాను) 

    అభేరి  
    130) హనుమ0తుడు సముద్ర జలాల          చల్లార్చుకొనె లా0గూల జ్వాల
    తలచిన కార్యము నెరవేర్చితినని                  తేరి పారజూచె వెనకకు తిరిగి
    కనుపి0చెను ఘోరాతి ఘోరము                  జ్వాలాభీలము ల0కాపురము
    మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

    131) సీతామాత క్షేమము మరచితి              కోపతాపమున ల0క దహి0చితి
    ల0కాపురము సర్వము పోగా                      ఇ0కా జానకి మిగిలియు0డునా
    సిగ్గు మాలిన స్వామి ద్రోహిని                        సీతను చ0పిన మహాపాపినని
    మారుతి వగచె తా చేసిన పనిగని                 తన కోపమె తన శత్రువాయెనని

    132) సీత లేనిదే రాముడు0డడు                 రాముడు లేనిదే లక్ష్మణు డు0డడు
    భరత శతృఘ్న సుగ్రీవాదులు                     ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు
    ఈ ఘోరమునకు కారణమైతిని                   నాకు మరణమే శరణ్యమని
    మారుతి వగచె తా జేసిన పనిగని                తన కోపమే తన శత్రువాయెనని

    133) శ్రీ రఘురాముని ప్రియ సతి సీత         అగ్ని వ0టి మహా పతివ్రత
    అగ్నిని అగ్ని దహి0ప నేర్చునా                  అయోనిజను అగ్ని దహి0చునా
    నన్ను కరుణి0చిన అగ్ని దేవుడు               సీతను చల్లగ చూడకు0డునా
    అని హనుమ0తుడు తలచు చు0డగ         శుభ శకునములు తోచె ప్రీతిగా

    134) యెల్ల రాక్షసుల సిరిస0పదలు           మ0టలపాలై దహనమాయెనని
    అశోకవనము ధ్వ0సమైనను                     జానకి మాత్రము క్షేమమేనని
    ల0కాపురము రూపుమాసినను                విభీషణు గృహము నిలిచియు0డెనని
    అ0బర వీధిని సిద్ధ చారణులు                    పలుకగా విని మారుతి పొ0గెను
                                                                                                (శ్రీ హనుమాను)
    వలజి
    135) అశోకవనము మారుతి చేరెను           ఆన0దాశ్రుల సీతను గా0చెను
    తల్లీ నీవు నా భాగ్యవశమున                     క్షేమము0టివని పదముల వ్రాలెను
    పోయివత్తునిక సెలవు నిమ్మని                  అ0జలి ఘటి0చి చె0త నిలచెను
    సీతా మాత హనుమ0తునితో                   ప్రీతిగ పలికెను ఆన0దముతో

    136) హనుమా అతులిత బలధామా          శత్రుకర్మనా శా0తినిదానా
    ఇ0దు0డి నన్ను యీ క్షణమ0దే               కొనిపోగల సమర్ధుడ వీవే
    రాముని వేగమె తోడ్కొని రమ్ము                రాక్షస చెర నాకు తొలగి0పుము
    అని పల్కె సీత హనుమ0తునితో              స0పూర్ణమైన విశ్వాసముతో

    137) తల్లీ నిన్ను చూచిన దాదిగ               త్వర పడుచు0టిని మరలిపోవగ
    భీతి నొ0దకుము నెమ్మది ను0డుము       త్వరలో నీకు శుభములు కలుగు
    రామ లక్ష్మణ సుగ్రీవాదులను                   అతి శీఘ్రముగా కొని రాగలను
    అని  మారుతి సీత పదముల వ్రాలె            సెలవు గైకొని రివ్వున మరలె
                                                                                            (శ్రీ హనుమాను) 
    దర్బారుకానడ  
    138)  అరిష్టమను గిరిపై నిలిచి                   మారుతి ఎగసెను కాయము పె0చి
    పవన కుమారుని పదఘట్టనకే                  పర్వతమ0తయు పుడమిని క్రు0గె
    సీతను గా0చిన శుభవార్త వేగ                    శ్రీరామునకు తెలియచేయగ
    మారుతి మరలెను అతివేగముగ               ఉత్తర దిశగా వారిధి దాటగ  

    139) గరుడుని వోలె శరవేగముగొని           పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని
    మార్గ మధ్యమున మైనాకునిగని               ప్రేమ మీరగ క్షేమము కనుగొని
    దూరమును0డి మహే0ద్ర శిఖరిని             ఉత్సాహమున ము0దుగా గని
    విజయ సూచనగ గర్జన సేయుచు             మారుతి సాగెను వేగము పె0చుచు

    140) సు0దరమైన మహే0ద్ర గిరిపైన          సెలయేట దిగి తానమాడి
    జా0బవదాది పెద్దల0దరికి                         వాయున0దనుడు వ0దనములిడి
    చూచితి సీతను చూచితి సీతను                 అను శుభవార్తను ము0దుగ పలికెను
    కపి వీరులు హనుమ0తుని బొగడిరి          ఉత్సాహమున కిష్కి0ధకు సాగిరి   

    141) జా0బవద0గద హనుమదాదులు       ప్రస్రవణ గిరి చేరుకొనినారు
    రామలక్ష్మణ సుగ్రీవాదులకు                      వినయముతో వ0దనమిడి నారు
    ఆ0జనేయుడు శ్రీరామునితో                      చూచితి సీతనని శుభవార్త తెల్పె
    చూడామణిని శ్రీరామునకిడి                      అ0జలి ఘటి0చి చె0తన నిలచె
                                                                                              (శ్రీ హనుమాను)
     సి0ధుభైరవి 
    142) చూడామణిని రాముడుగైకొని           తన హ్రుదయానికి చేర్చి హత్తుకొని
    మాటలు రాని ఆన0దముతో                    ఆశ్రులు ని0డిన నయనాలతో
    హనుమా సీతను ఎట్లు గా0చితివి             ఎట్లున్నది సీత ఏమి తెల్పినది
    అని పలికిన శ్రీ రామచ0ద్రునకు                మారుతి తెల్పె తన ల0కాయానము 

    143) శత యోజనముల వారిధి దాటి          ల0కాపురమున సీతను గా0చితి
    రాలు కరుగగా సీత పలుకగా                     నా గు0డెలaక్రోదాగ్ని రగులగా
    అసురుల గూల్చితి ల0క దహి0చితి            రావణునితో స0వాదము సల్పితి
    ఆని మారుతి తన ల0కాయానమును        రామ చ0ద్రునకు విన్నవి0చెను

    144) నిరతము నిన్నే తలచు చున్నది         క్షణక మొక యుగముగ గడుపు చున్నది
    రె0డు నెలల గడువు తీరకమునుపే             వేగమె వచ్చి కాపడుమన్నది
    రామలక్ష్మణ సుగ్రీవాదులకు                       సీత క్షేమమని తెలుపమన్నది
    అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను 

    145) రామలక్ష్మణుల భుజముల నిడుకొని   వేగమె ల0కకు గొని వత్తునని
    రామలక్ష్మణుల అగ్నిశరములకు                రావణాదులు కూలుట నిజమని
    ఎన్నోరీతుల సీతామాతకు                          ధ్రైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
    అని మారుతి తన ల0కాయానమును          రామచ0ద్రునకు విన్నవి0చెను

    146) అ0దరు కలసి అయోధ్యకు చేరి            ఆన0ధముగా సుఖి0చెదరని
    సీతారామ పట్టాభిషేకముకము                    కనుల ప0డువుగ జరిగి తీరునని
    ఎన్నో రీతుల సీతామాతకు                          ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని
    అని మారుతి తన ల0కాయానమును           రామచ0ద్రునకు విన్నవి0చెను  

    147) ఆన0దముతో  ఆశ్రులు జారగ          సీతామాత నను దీవి0చగ
    పదముల వ్రాలినే పయనమైతిని               పదములు రాకనే మరల వచ్చితిని
    ఒప్పలేదు కాని ఎపుడో తల్లిని                   భుజముల నిడుకొని కొనిరాకు0దునా
    అని మారుతి తన ల0కాయానమును       రామచ0ద్రునకు విన్నవి0చెను

    148) సీత క్షేమమను శుభవార్త నేడు         మారుతి నాకు తెలుపకు0డిన
    నేటి తోడ మా రఘుకులమ0తా                 అ0తరి0చి యు0డెడిది కదా
    మమ్మీ తీరుగ ఉద్ధరి0చిన                         మారుతికి ఎమివ్వగలనని
    సర్వమిదేనని కౌగిట జేర్చెను                     హనుమ0తుని ఆజానుబాహుడు

    149) నలుగురు శ్రద్దతో ఆలకి0చగ            నలుగురు భక్తితొ ఆలపి0చగా
    సీతరాము హనుమానులు సాక్షిగ             సర్వజనులకు శుభములు కలుగగ
    కవి కోకిల వాల్మీకి పలికిన                        రామాయణమును తేట తెలుగున
    శ్రీగురు చరణ సేవా భాగ్యమున                   పలికెద సీత రామకథ
                                                                                                   (శ్రీహనుమను)
                                                                
                                                                మ0గలహారతిగొను హనుమ0త 
           సీతా రామలక్ష్మణ  సమేత 
         నా అ0తరాత్మ నిలుమో అన0త
          నీవే అ0త శ్రీ హనుమ0త


    http://www.4shared.com/account/dir/_KnMQHJy/_online.html?rnd=27